హోండా క్లిక్ టూ-వీలర్ వచ్చేసింది.. ధర కేవలం 44,524 రూపాయలే..!

ఇప్పుడు ఉన్న స్కూటీలలో అతి తక్కువ ధర కలిగిన హోండా క్లిక్ ను భారత్ లో లాంచ్ చేశారు. దీని ధర 44,524 రూపాయలే (చెన్నై ఎక్స్-షో రూమ్ ధర). తమిళనాడులో ఈ బైక్ లను అమ్మకానికి ఉంచారు. 110 సీసీ సింగిల్ సిలిండర్ బీఎస్ 4 ఇంజన్ కలిగి ఉండడమే కాకుండా హోండా ఎకో టెక్నాలజీ ఈ బైక్ ఫీచర్స్ లో ఉంది. ఈ స్కూటర్ కు కాంబి-బ్రేకింగ్ సిస్టం తో పాటుగా ఈక్వలైజర్ టెక్నాలజీ కూడా ఉంది. మిగతా స్కూటీలతో పోల్చుకుంటే క్లిక్ లుక్ కాస్త విభిన్నంగా అనిపిస్తుంది. హోండా యాక్టీవా కంటే కాస్త తక్కువ బరువే.. హోండా క్లిక్ బరువు 102 కేజీలు. ఫుట్ బోర్డ్ చాలా విశాలంగా ఉంటుందని.. 14 లీటర్ల పెట్రోల్ ట్యాంక్ కెపాసిటీ కలదని కంపెనీ తెలిపింది. 10 ద్విచక్రవాహనాలు అమ్ముడుబోతే వాటిలో ఆరు స్కూటర్లు ఉంటున్నాయని అందుకనే ఈ మార్కెట్ పై దృష్టి సారించినట్లు హోండా కంపెనీ తెలిపింది. ఈ బైక్ ను మగ వాళ్ళకైనా, ఆడవాళ్ళకైనా బాగా సూట్ అవుతుందని.. రైడర్స్ కి తక్కువ హైట్ అనిపించేలా డిజైన్ చేసినట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు.

About the author

Related

JOIN THE DISCUSSION