ఒకే ఒక్క రోజు ఆరు సినిమాలు.. తెలుగు ప్రేక్షకులు దేన్ని ఇష్టపడుతారో..!

తెలుగు సినీ అభిమానులపై ఒకే రోజు ఆరు సినిమాలు దండయాత్ర చేయబోతున్నాయి. ఎప్పుడంటారా ఈ శుక్రవారమే..! ఈ నెల 15వ తేదీన ఒక్కరోజునే 6 సినిమాలు తెలుగులో విడుదలవుతున్నాయి. సునీల్ ‘ఉంగరాల రాంబాబు’ .. సందీప్ కిషన్ ‘ప్రాజెక్ట్ జెడ్’ .. నారా రోహిత్ ‘కథలో రాజకుమారి’ .. విజయేంద్ర ప్రసాద్ దర్శకత్వం వహించిన ‘శ్రీవల్లీ’ .. సచిన్ జోషి ‘వీడెవడు’ ఇక అనువాద చిత్రంగా నయనతార – శింబు కాంబినేషన్లోని ‘సరసుడు’ ఆ రోజున ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. వీటిలో ఒకటి రెండు వెనక్కు వెళ్ళినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.

ఇంతగా ఒకే సారి అన్ని సినిమాలు రావడానికి కారణం ఆ తర్వాత వరుసగా పెద్ద సినిమాలు విడుదల కానుండడమే.. ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేసిన ‘జై లవ కుశ’ ఈ నెల 21న విడుదల అవుతోంది. ఎంతో హైప్ ఉన్న ఈ సినిమాను తట్టుకోవడం చిన్న సినిమాలకు వీలయ్యే పరిస్థితి కాదు. ఇక 120 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ‘స్పైడర్’ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ తరువాత 29న ‘మహానుభావుడు’ కూడా వచ్చేలా ఉన్నాడు. కాబట్టి ముందే విడుదల అయిపోతే మంచిదన్న కారణంతో విడుదల చేసేస్తున్నారు. ఉంగరాల రాంబాబుకి మంచి పేరు వస్తే రెండో వారం కూడా నిలదొక్కుకునే అవకాశం ఉంది. అది కుదరలేదంటే జై లవకుశ సునామీని తట్టుకోవడం కష్టమే..!

About the author

Related

JOIN THE DISCUSSION