ఉప ముఖ్యమంత్రిగా.. పన్నీర్ సెల్వం..!

గత కొన్ని నెలలుగా తమిళనాడులో జరుగుతున్న హైడ్రామాకు తెర పడినట్లు కనిపిస్తోంది. పళని స్వామి వర్గం పన్నీర్ సెల్వం వర్గం గత కొద్ది రోజులుగా జరిపిన చర్చలు చివరికి ఓ కొలిక్కి వచ్చాయి. ఉప ముఖ్యమంత్రి పదవిని పన్నీర్ సెల్వం కు అప్పగించారు. ప‌న్నీర్ సెల్వంకు ఉప ముఖ్య‌మంత్రి, ఆర్థిక శాఖ బాధ్య‌త‌లు అప్ప‌గించారు. పాండ్య‌రాజ‌న్‌కు త‌మిళ‌నాడు భాషాభివృద్ధి శాఖ బాధ్య‌త‌లు ఇచ్చారు. అలాగే అన్నాడీఎంకే మార్గ‌ద‌ర్శ‌క క‌మిటీకి క‌న్వీన‌ర్ గా ప‌న్నీర్ సెల్వం వ్య‌వ‌హ‌రించ‌నున్నారు. ఇదే క‌మిటీ స‌హ క‌న్వీన‌ర్ బాధ్య‌త‌ల‌ను ప‌ళ‌నిస్వామి నిర్వ‌ర్తించ‌నున్నారు.

ఇక పార్టీపై ఎటువంటి అధికారాలు చిన్నమ్మ శశికళకు కానీ.. వాళ్ళ వర్గానికి కానీ ఉండకూడదని ఇరు వర్గాలు నిర్ణయించుకున్నాయి. పార్టీ చీఫ్ పదవి నుండి శశికళను తొలగించనున్నారు. జయలలిత సమాధి వద్దకు చేరుకున్న ఇరు వర్గాల సభ్యులు.. తాము ఇకపై కలసి ఉండబోతున్నట్లు చెప్పారు. అమ్మ ఆశయ సాధన కోసం పని చేస్తామని చెప్పారు.

About the author

Related

JOIN THE DISCUSSION