ఆరు బంతులు..ఆరు వికెట్లు: అన్నీ క్లీన్‌బౌల్డ్సే! ఎవ‌రా బౌల‌ర్‌?

ఆరు బంతుల్లో ఆరు సిక్సులు కొట్టిన వారిని చూశాం. హ్యాట్రిక్ తీసుకున్న బౌల‌ర్లూ చాలామందే. ఒకే ఓవ‌ర్‌లో నాలుగు వికెట్ల‌ను ప‌డ‌గొట్టిన వారు ఉన్నారు. ఆరు బంతుల్లో ఆరు వికెట్ల‌ను ప‌డ‌గొట్టిన వాళ్లెవ‌రైనా ఉన్నారా? అంటే స‌మాధానం కోసం త‌డుముకుంటాం. లేర‌నీ చెప్పేస్తాం. ఇప్పుడిక అలాంటి స‌మాధానం రాదు.

ఇంగ్లండ్ టీనేజ్ కుర్రాడొక‌డు ఆరు బంతుల్లో ఆరు వికెట్ల‌ను ప‌డ‌గొట్టాడు. త‌న టీమ్‌కు తిరుగులేని విజ‌యాన్ని అందించాడు. అత‌ని పేరు ల్యూక్ రాబిన్‌స‌న్‌. ఫిల‌డెల్ఫియా క్రికెట్ క్ల‌బ్ త‌ర‌ఫున అండ‌ర్‌-13 మ్యాచ్ ఆడుతున్న ల్యూక్‌.. ఈ ఘ‌న‌త‌ను సాధించాడు. విశేష‌మేంటంటే- ల్యూక్ ప‌డ‌గొట్టిన వికెట్ల‌న్నీ క్లీన్ బౌల్డ్సే .

 

వ‌రుస‌గా ఆరు బంతుల్లో ఆరు సార్లు వికెట్ల‌ను గిరాటేసింది అత‌ను విసిరిన బంతి. ఇంకో విశేష‌మేంటంటే- ఆ మ్యాచ్‌కు అత‌ని తండ్రి స్టీఫెన్ అంపైర్‌. త‌న కుమారుడి ఘ‌న‌త‌ను ద‌గ్గ‌రుండి చూసే అదృష్టం క‌లిగింద‌త‌నికి. ఫిల‌డెల్ఫియా క్ల‌బ్ క్రికెట్ ఆయ‌న కోచ్ కూడా. ఇంగ్లండ్‌లోని దుర్హ‌మ్‌లో ల్యాంగ్లీ పార్క్ తో జ‌రిగిన మ్యాచ్‌తో ల్యూక్ అద‌ర‌గొట్టాడు.

About the author

Related

JOIN THE DISCUSSION