క్యాష్‌లెస్‌..పెట్రోల్‌బంక్‌: 13 వ‌ర‌కు వాయిదా

క్యాష్‌లెస్‌..పెట్రోల్‌బంక్‌: 13 వ‌ర‌కు వాయిదా

వాహ‌న‌దారుల‌కు కొద్దిగా ఊర‌ట‌. డెబిట్‌, క్రెడిట్ కార్డ‌ల లావాదేవీల‌ను నిలిపివేస్తున్న‌ట్లు దేశ‌వ్యాప్తంగా పెట్రో డీల‌ర్లు తీసుకున్న నిర్ణ‌యం వాయిదా ప‌డింది. ఈ నెల 13వ తేదీ వ‌ర‌కూ వాయిదా వేశారు. అద‌నపు స‌ర్వీసు ఛార్జీల నిర్ణ‌యాన్ని బ్యాంక‌ర్లు 13వ తేదీ వ‌ర‌కు వాయిదా వేశాయి. దీనికి అనుగుణంగా పెట్రో డీల‌ర్లు కూడా త‌మ నిర్ణ‌యాన్ని మార్చుకున్నారు.

డెబిట్‌, క్రెడిట్ కార్డుల ద్వారా లావాదేవీల‌ను నిర్వ‌హించాలంటూ ప్ర‌జ‌ల‌కు హిత‌బోధ చేస్తోన్న కేంద్ర‌ప్ర‌భుత్వం.. స‌ర్వీసు ఛార్జీల‌ను వ‌సూలు చేయొద్ద‌నే సూచ‌న‌ను మాత్రం బ్యాంకుల‌కు చేయ‌లేక‌పోయింది. దీని ఫ‌లితమే- ఈ గంద‌ర‌గోళం. డెబిట్‌, క్రెడిట్ కార్డుల‌పై స‌ర్వీసు ఛార్జీల భారాన్ని బ్యాంక‌ర్లు త‌మ‌పై మోపడంపై పెట్రోలు పోసిన మంట‌ల్లా భ‌గ్గుమంటున్నారు పెట్రో డీల‌ర్లు. అద‌న‌పు ఛార్జీల భారం మాకెందుకు? అస‌లు కార్డుల వాడ‌కాన్నే నిలిపివేస్తే పోలా? అనేది వారి వాద‌న‌. క్యాష్ లెస్ అని చెప్పుకొంటూ తిర‌గ‌డం కాదు గానీ.. దాని వ‌ల్ల వ‌చ్చే ఇబ్బందుల‌ను కూడా ప‌రిష్క‌రించాల్సిన బాధ్య‌త ప్ర‌భుద్వానిదే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *