ప్రేమించి పెళ్లి చేసుకున్న న‌వ‌దంప‌తుల‌కు పోలీసులే విల‌న్ల‌య్యారు..!

వారిద్ద‌రూ ప్రేమించుకోవ‌డం రెండు కుటుంబాల్లోనూ ఇష్టం లేదు. వారి పెళ్లికి అంగీక‌రించ‌లేదు. అయిన‌ప్ప‌టికీ- వారు విడిపోలేదు. మౌనంగా భ‌గ్న ప్రేమికుల్లా మార‌లేదు. పెద్ద‌ల‌ను ఎదిరించారు. గుళ్లో పెళ్లి చేసుకున్నారు. అది ఇష్టం లేని.. పెద్ద‌లు పోలీసుల‌కు లంచం ఇచ్చారు. దీనితో పోలీసులు ఆ న‌వ దంప‌తుల పాలిట విల‌న్ల‌య్యారు.

24 గంట‌ల పాటు వారిని స్టేష‌న్‌లో నిర్బంధించారు. మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని సాగ‌ర్ జిల్లాలో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. జిల్లాలోని దేవ‌రి పోలీస్‌స్టేష‌న్ ప‌రిధిలోని కొత్వాలీలో నివ‌సించే బ్రిజేష్ సేన్‌, రూప‌మ్ (పేరు మార్చాం) ప్రేమికులు. ఈ విష‌యం రెండు కుటుంబాల్లో పెద్ద‌ల‌కు తెలిసింది. పెళ్లిని వ్య‌తిరేకించారు.

అయిన‌ప్ప‌టికీ- వారు విడిపోలేదు. త‌మ ప్రేమ‌కు సుఖాంతం చేయాలని నిర్ణ‌యించుకున్నారు. బ్రిజేష్ సేన్, రూప‌మ్ సాగ‌ర్ జిల్లా కేంద్రానికి వెళ్లి రిజిస్ట‌ర్ పెళ్లి చేసుకున్నారు. అక్క‌డే నివ‌సించ సాగారు. ఈ పెళ్లి ఇష్టం లేని బ్రిజేష్‌, రూప‌మ్ కుటుంబీకులు దేవ‌రి పోలీస్‌స్టేష‌న్‌లో ఫిర్యాదు చేశారు. ఇద్ద‌రూ మేజ‌ర్లు కావ‌డంతో తామేమీ చేయ‌లేమ‌ని పోలీసులు చెప్పారు.

అయిన‌ప్ప‌టికీ.. బ్రిజేష్ కుటుంబీకులు పోలీసుల‌కు లంచం ఇచ్చారు. దీనితో పోలీసులు న‌వ దంప‌తుల‌ను దేవ‌రి పోలీస్‌స్టేష‌న్‌కు పిలిపించారు. విచార‌ణ పేరుతో వేధించారు. రోజంతా పోలీస్‌స్టేష‌న్‌లోనే కూర్చోబెట్టారు. అనంత‌రం- ఈ ఘ‌ట‌న‌పై బ్రిజేష్ కొత్వాలి పోలీస్‌స్టేష‌న్‌లో ఫిర్యాదు చేశారు. త‌న కుటుంబ స‌భ్యుల‌పై ఎద‌రు కేసు వేశాడు.

About the author

Related

JOIN THE DISCUSSION