యువ‌తి దారుణ హత్య‌: పోస్ట్‌మార్ట‌మ్ రిపోర్ట్ చూసి ఉలిక్కిప‌డ్డ పోలీసులు!

ఉత్త‌ర్‌ప్ర‌దేశ్‌లో ఓ యువతి దారుణ హ‌త్య‌కు గురైంది. గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు ఆమెను తుపాకీతో నుదుటిపై కాల్చి చంపారు. ఉత్త‌ర్‌ప్ర‌దేశ్‌లోని కౌశంబి లింక్ రోడ్డు ప‌క్క‌న పొద‌ల్లో ఆ యువ‌తి మృత‌దేహాన్ని స్థానికులు గుర్తించారు. అనంత‌రం స్థానిక పోలీసుల‌కు స‌మాచారం అందించారు.

స‌మాచారం అందుకున్న వెంట‌నే సంఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకున్న పోలీసులు మృత‌దేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్ట్‌మార్ట‌మ్ కోసం ఆసుప‌త్రికి త‌ర‌లించారు. యువ‌తి అవివాహితురాలు. అక్క‌డే ఈ హ‌త్యోదంతం అనూహ్య మ‌లుపు తీసుకుంది. పోస్ట్‌మార్ట‌మ్ రిపోర్ట్ చూసిన పోలీసులు ఉలిక్కిప‌డ్డారు.

ఆమె నాలుగు నెల‌ల గ‌ర్భంతో ఉన్న‌ట్టు పోస్ట్‌మార్ట‌మ్ రిపోర్ట్‌తో స్ప‌ష్ట‌మైంది. పెళ్లి కాకుండానే త‌ల్ల‌యింద‌ని, ఈ కార‌ణంగానే- ఆమె హ‌త్య‌కు గురై ఉంటుంద‌ని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆమె ప్రేమికుడే ఈ హ‌త్య చేసి ఉంటాడ‌ని, లేదా కిరాయి వ్య‌క్తుల ద్వారా హ‌త్య చేయించి ఉంటాడ‌ని పోలీసులు ప్రాథ‌మికంగా నిర్ధారించారు.

హ‌తురాలి ఒంటిపై ఉన్న దుస్తుల‌ను బ‌ట్టి చూస్తే.. ఆమె ఉన్న‌త విద్యావంతురాలై ఉంటుంద‌ని, ధ‌నిక కుటుంబానికి చెందిన యువ‌తి అయి ఉంటుంద‌ని పోలీసులు అంచ‌నా వేశారు. వేరే చోట ఆమెను హ‌త‌మార్చి, మృత‌దేహాన్ని రోడ్డు ప‌క్క‌న పడేసి ఉంటారని భావిస్తున్నారు.

About the author

Related

JOIN THE DISCUSSION