జింక‌ను మింగి..గుడ్లు తేలేసింది!

పాపం! ఆ కొండ చిలువ‌కు ఆక‌లి, ఆత్ర‌మూ రెండూ ఎక్కువేనేమో! కంటికి కనిపించిన వెంట‌నే ఓ జింక‌పై దాడి చేసింది. ఎటూ పారిపోకుండా దాన్ని చుట్టేసింది. చిన్న నోరును పెద్ద‌గా చాచి.. ఆ జింక‌ను గుట‌కాయ స్వాహా చేసింది. దీనితో దాని క‌ళ్లు బైర్లు క‌మ్మాయి. గుడ్లు తేలేసింది. క‌డుపులోకి వెళ్లిన జింక‌ను అరిగించుకోలేక నానా తంటాలూ ప‌డింది.

జింక బ‌రువును మోయ‌లేక‌.. ఎటూ క‌ద‌ల్లేకా తిన్న‌చోట‌నే ప‌డుండిపోయింది. క‌ర్ణాట‌క‌లోని శివ‌మొగ్గ జిల్లాలో క‌నిపించిన దృశ్యం ఇది. జిల్లాలోని పుర‌దాళు పంచాయితీ స‌మీపంలోని గుడ్డ‌ద అర‌కెరె గ్రామం కాస్త అడ‌వుల‌కు ఆనుకుని ఉంటుంది.

ఆదివారం సాయంత్రం ఓ కొండ చిలువ జింక‌ను మింగింది. దాని బ‌రువుకు ఎటూ క‌ద‌ల్లేదు. దీన్ని గ‌మ‌నించిన స్తానికులు అట‌వీశాఖ సిబ్బందికి స‌మాచారం ఇచ్చారు. కొండ చిలువ‌తో ప్ర‌స్తుతానికి వ‌చ్చిన ప్ర‌మాద‌మేమీ లేద‌ని తేల్చారు. ఈ కొండ చిలువ‌ను చూడ‌టానికి జ‌నం భారీగా చేరుకున్నారు.

About the author

Related

JOIN THE DISCUSSION