ఒళ్లు గ‌గుర్పాటు: చేప‌ల వ‌ల‌లో..!

చేప‌ల కోసం వ‌ల విసిరారు జాల‌ర్లు. కొన్ని గంట‌ల త‌రువాత చూస్తే వ‌ల బాగా బ‌రువుగా అనిపించింది. ఉత్సాహంతో జాల‌ర్లు వ‌ల‌ను బ‌య‌టికి తీయ‌గా.. అందులో క‌నిపించింది చూసి బిత్త‌ర‌పోయారు. వ‌ల‌ను అక్క‌డే పారేశారు. వ‌ల‌లో ప‌డింది చేప‌లు కాదు..ఓ భారీ కొండ‌చిలువ‌.

ఈ సంఘ‌ట‌న చోటు చేసుకున్నది తెలంగాణ‌లోని సంగారెడ్డి జిల్లాలో. కొద్దిరోజులుగా కురుస్తున్న భారీ వ‌ర్షాల‌కు జిల్లాలోని జిన్నారం మండ‌లం అక్క‌మ్మ చెరువు నిండిపోయింది. భారీ వ‌ర్షాల వ‌ల్ల చెరువు అలుగు పోస్తోంది.

దీనితో బుధ‌వారం జిన్నారానికి చెందిన జాల‌ర్లు అక్క‌మ్మ చెరువులో చేప‌లు ప‌ట్ట‌డానికి వెళ్లారు. వ‌ల విసిరారు. కొన్ని గంట‌ల త‌రువాత దాన్ని బ‌య‌టికి తీయగా.. భారీ కొండచిలువ క‌నిపించింది. దీనితో జాల‌ర్లు భయాందోళనకు గురయ్యారు.

చివ‌రికి- ధైర్యం చేసి వలలో నుంచి దానిని బయటకు తీయ‌డానికి ప్ర‌య‌త్నించారు. వ‌ల నుంచి అది జారిపోయి తిరిగి చెరువులోకి వెళ్లింది. అది సుమారు 12 అడుగులు ఉన్నదని జాల‌ర్లు తెలిపారు.

About the author

Related

JOIN THE DISCUSSION