పని మనిషి హత్య చేశారన్నారు.. ఆ తర్వాత తల్లిదండ్రులని అన్నారు.. ఇప్పుడు వారూ కాదట..!

ఆరుషి తల్వార్.. 2008 మే 16న‌ 14 సంవత్సరాల అమ్మాయిని ఎంతో దారుణంగా హత్య చేశారు. అతన్ని వారి పనిమనిషి అయిన హేమరాజ్ హత్య చేసి ఉంటాడని అనుకున్నారు. కానీ అతడు కూడా వారి ఇంటి పైన శవమై తేలడంతో వారి తల్లిదండ్రులే ఈ రెండు హత్యలకు కారణమని పోలీసులు భావించారు. అలాగే సర్జికల్ బ్లేడ్స్ తో కోసినట్లుగా ఉండడంతో దోషులని భావించి వారికి జీవితఖైదును విధించారు. దీనిపై వారు పలుమార్లు కోర్టును ఆశ్రయించారు. తాజాగా ఈ కేసుపై అల‌హాబాద్ హైకోర్టు సంచ‌ల‌న తీర్పునిచ్చింది. ఆరుషి త‌ల్లిదండ్రులు నూపుర్‌ త‌ల్వార్‌, రాజేశ్ త‌ల్వార్‌ల‌ను నిర్దోషులుగా ప్ర‌క‌టించింది. సీబీఐ స‌రైన ఆధారాలు చూపించ‌లేద‌ని త‌ల్వార్ దంప‌తుల‌ను నిర్దోషులుగా నిర్ణ‌యించింది.

దాదాపు తొమ్మిదేళ్ల త‌ర్వాత ఈ కేసులో వారిని నిర్దోషులుగా ప్ర‌క‌టిస్తూ అల‌హాబాద్ కోర్టు తీర్పునిచ్చింది. డివిజన్ బెంచ్ న్యాయ మూర్తులు బి.కె.నారాయణ, ఎ.కె.మిశ్రా సెప్టెంబర్ 7నే ఈ కేసుపై ఓ నిర్ణయానికి వచ్చారు. ఆ తర్వాత ఈ రోజున దానిపై తీర్పును ఇచ్చారు. ప్రస్తుతం వారిద్దరూ ఘజియాబాద్ లోని దస్నా జైలులో ఉంటున్నారు. దీనిపై సీబీఐ సుప్రీంకోర్టుని ఆశ్ర‌యించే అవ‌కాశ‌మున్న‌ట్లు తెలుస్తోంది.

    

About the author

Related

JOIN THE DISCUSSION