పబ్లిసిటీ కోసం పాకులాడి అరెస్ట్ అయ్యింది

కొందరు సెలెబ్రిటీలు పబ్లిసిటీ కోసం పాకులాడి ఏమేమో చేస్తుంటారు. అలా చేయడం వల్ల కొన్ని కొన్ని సార్లు లేనిపోని కష్టాలు తెచ్చుకొంటుంటారు. అలాంటి కోవకు చెందిన సెలెబ్రిటీలు బాలీవుడ్ లో చాలామంది ఉన్నారు. వారిలో బాలీవుడ్ హాట్ భామ రాఖీ సావంత్ కూడా ఒకరు. అలా నోటికొచ్చినట్లు మాట్లాడి ఇప్పుడు ఊచలు లెక్కపెడుతోంది.

రామాయణాన్ని రచించిన వాల్మీకి పైన రాఖీ నోటికొచ్చిన వ్యాఖ్యలు చేసింది. అంతే కాక వాల్మీకి సామాజిక వర్గంపై కూడా నోటికొచ్చినట్లు మాట్లాడడంతో లూథియానా కోర్టును ఆశ్రయించారు. పిటిషన్ను స్వీకరించిన కోర్టు విచారణకు హాజరుకావాలంటూ రాఖీకి పలుమార్లు నోటీసులు జారీ చేసింది.

అయితే రాఖీ స్పందించక పోవడంతో రాఖీని అరెస్ట్ చేసి తన ముందు హాజరుపరచాలంటూ పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. నిన్న సాయంత్రమే ముంబై బయలుదేరిన పంజాబ్ పోలీసులు నేటి మధ్యాహ్నం రాఖీని అరెస్ట్ చేశారు. కోర్టు ఆదేశాల మేరకే రాఖీని అదుపులోకి తీసుకున్నామని ప్రకటించిన పంజాబ్ పోలీసులు ఆమెను లూథియానా కోర్టు ముందు హాజరుపరచనున్నట్లు తెలిపారు.

అందుకే నోటిని అదుపు లో పెట్టుకుంటే మంచిదని చెబుతుంటారు పెద్దలు. ఇలా నోటిని అదుపులో పెట్టుకోలేని రామ్ గోపాల్ వర్మ, కమాల్ ఆర్ ఖాన్ లాంటి వ్యక్తులకు రాఖీ సావంత్ కు ఎదురయ్యిన ఘటన ఓ గుణపాఠం కావాలి.

About the author

Related

JOIN THE DISCUSSION