ఈ వ్యాధి సోకినవారు నియంత్రించలేని కామవాంఛలతో, ఉన్మాదులుగా ప్రవర్తిస్తారు.. అదే డేరా బాబాకు సోకింది..!

రేపిస్ట్ బాబా గుర్మీత్ రామ్ రహీం సింగ్ ను పరీక్షించిన వైద్యులు అతనో సెక్స్ అడిక్ట్ అని తేల్చారు.. ప్రస్తుతం జైలులో ఉన్న డేరా బాబా రాత్రైతే చాలు నిద్రపోకుండా పాటలు పాడుతూ.. గట్టిగా అరుస్తూ చిత్ర విచిత్రంగా ప్రవర్తిస్తున్నాడు. అయితే అతను అలా ప్రవర్తించడానికి ‘సిటిరియాసిస్’ అనే వ్యాధి కారణమట..! ఈ రోగం ఉన్న వాళ్లకు కామవాంఛ చాలా ఎక్కువగా ఉంటుంది. శృంగారం లేకపోతే ఉన్మాదులుగా ప్రవర్తిస్తారని వైద్యులు తెలిపారు. ఈ విషయాన్ని అయిదుగురు సభ్యులు ఉన్న బృందం తెలిపింది.

డేరా బాబా తన ఆశ్రమంలో చేరే అమ్మాయిలపై ప్రత్యేక దృష్టి పెట్టేవాడు. ‘షహీ బేటియా’ అని పిలిచే అమ్మాయిలను బాబా బ్రెయిన్ వాష్ చేసి తన వద్దకు కొత్త కొత్త అమ్మాయిలను వచ్చేలా చేసేవాడు. అందులో పనిచేసిన ఓ సాధ్వి చెప్పింది ఏమిటంటే కొత్తగా చేరిన అమ్మాయిలపై బాబా ఓ కన్ను వేసి ఉంచేవాడు. బాగా అందంగా ఉన్న వాళ్ళను స్కూలుకు పంపించే బాబా.. అందంగా లేని అమ్మాయిలను వంటలను చేయడానికి.. ఇళ్ళు కడగడం లాంటి పనులకు ఉపయోగించేవాడు.

అమ్మాయిల హాస్టల్ కు వెళ్ళడానికి డేరా బాబా ఓ గుహ లాంటి దాన్ని ఏర్పాటు చేసుకున్నాడు కూడా.. ఇష్టం వచ్చిన అమ్మాయిని తన కామవాంఛ తీర్చుకోడానికి ఉపయోగించుకునేవాడు. బాబా మాట వినకుంటే వారిని చిత్ర హింసలు పెట్టేవారు.. కూడు.. నీళ్ళు లేకుండా చేసేవారు. అతని బారి నుండి తప్పించుకోవాలంటే చెప్పాల్సిన ఒక్క కారణం తమకు పీరియడ్స్ అని.. ఒకవేళ వారు చెప్పింది అబద్దం అని బాబాకు తెలిస్తే వారి జీవితం నరకమేనట..!

About the author

Related

JOIN THE DISCUSSION