కాజ‌ల్ గోరుముద్ద టేస్ట్ ఎలాగుంది రానా?

నిన్న‌టిదాకా భ‌ళ్లాల‌దేవునిగా ప్రేక్ష‌కుల‌తో పిలిపించుకున్న రానా.. ఇప్పుడు జోగేంద్ర‌గా మారిపోయారు. ఆయ‌న న‌టించిన తాజా చిత్రం `నేనే రాజు నేనే మంత్రి.` కాజ‌ల్ ఆయ‌న స‌ర‌స‌న రాధ‌గా న‌టించింది. ఈ సినిమా 11వ తేదీన విడుద‌ల కానుంది.

చాన్నాళ్ల త‌రువాత మెగాఫోన్ ప‌ట్టిన తేజ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన మూవీ ఇది. అనంత‌పురం నేప‌థ్యంలో సాగే ఈ సినిమా ఇప్ప‌టికే మంచి బిజినెస్ చేసింది. మూవీ ప్రమోష‌న్స్ కూడా బాగున్నాయి.

ఈ ప్ర‌మోష‌న్స్‌లో భాగంగా.. రానా, కాజ‌ల్ హైద‌రాబాద్‌లోని ఓ హోట‌ల్‌లో భోజ‌నానికి వెళ్లిన‌ప్పుడు క్లిక్ మ‌నిపించిన ఫొటో ఇది. ఇంకో ట్విస్ట్ ఏంటంటే.. రానా త‌న సూప‌ర్‌స్టార్ బ్ర‌ద‌ర్‌గా చెబుతోంది టాప్ హీరోయిన్ స‌మంత‌.

రానా భారీ క‌టౌట్ ఫొటోను ఆమె త‌న ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేసింది. `ద‌ట్స్ మై సూప‌ర్‌స్టార్ బ్ర‌ద‌ర్` అని కామెంట్ చేస్తూ ఓ భారీ క‌టౌట్‌ను ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేసిందామె.

About the author

Related

JOIN THE DISCUSSION