మ‌రో రేపిస్ట్ స్వాములోరు దొరికాడు..!

డేరా చీఫ్ గుర్మీత్ రామ్‌ర‌హీమ్ ఏ ముహూర్తంలో దొరికాడో గానీ.. దేశ‌వ్యాప్తంగా రేపిస్ట్‌బాబాల బాగోతం బ‌ట్ట‌బ‌య‌ల‌వుతోంది. గుర్మీత్ అంత‌టివాడినే అరెస్ట్ చేసిన పోలీసుల‌కు సాధార‌ణ బాబాలో లెక్కా అనుకున్న బాధితులు పోలీస్ స్టేష‌న్ల‌లో కేసులు న‌మోదు చేస్తున్నారు. రాజ‌స్థాన్‌లో ఫ‌ల‌హారీ బాబా ఓ యువ‌తిపై అత్యాచారం చేసిన ఘ‌ట‌న‌లో క‌ట‌క‌టాల పాల‌య్యాడు. ఊచ‌లు లెక్కిస్తున్నాడు.

ఈ సారి వంతు మ‌న హైద‌రాబాద్‌ది. హైద‌రాబాద్ నాచారంలో ఓ రేపిస్ట్ బాబా పోలీసుల చేతికి చిక్కాడు. ఆయ‌న గారి పేరు శ్రీ‌రామ శ‌ర్మ‌. దత్తపీఠం అధిపతి. నాచారం హెచ్‌ఎంటీ నగర్‌కు చెందిన మాధురి అనే మ‌హిళకు ద‌త్త‌పీఠం అధిప‌తి శ్రీ‌రామ శ‌ర్మ‌తో ప‌రిచ‌యం ఏర్ప‌డింది. అప్ప‌ట్లో అత‌ను బ‌షీర్‌బాగ్‌లోని క‌న‌క‌దుర్గ అమ్మ‌వారి గుడిలో పూజారి.

ఆమెకు భ‌ర్త ప్ర‌కాష్, ఇద్ద‌రు పిల్ల‌లు ఉన్నారు. నాలుగేళ్లుగా మాధురి శ్రీ‌రామ‌శ‌ర్మ‌ను విశ్వ‌సించేది. ఇంట్లో ఏదైనా శుభకార్యం చేయాల‌న్నా, ఆరోగ్యం బాగోలేకున్నా శ్రీ‌రామ శ‌ర్మ‌ను సంప్ర‌దించేది. ఈ క్ర‌మంలో ఆమె అత‌ని భ‌క్తురాలిగా మారింది. ప్రస్తుతం శ్రీ‌రామ‌శ‌ర్మ కాప్రాలోని కమలానగర్‌లో నివాసం ఉంటున్నాడు.

కొద్దిరోజులుగా మాధురి త‌ర‌చూ అనారోగ్యానికి గుర‌వుతూ వ‌స్తోంది. డాక్ట‌ర్ల‌కు చూపించిన‌ప్ప‌టికీ ఫ‌లితం రాలేదు. దీనితో పూజలు చేస్తే ఆరోగ్యం కుదుటపడుతుందని నమ్మించి ల‌క్ష‌ల రూపాయ‌ల‌ను వ‌సూలు చేశాడు. హెచ్‌ఎంటీ నగర్‌లోని మాధురి నివాసంలో పూజలు చేయాల‌ని సూచించాడు.

ఇంట్లో పూజ చేస్తున్న క్రమంలో భర్త ప్రకాష్‌, పిల్లలను దూరంగా ఉండాలని పంపాడు. పూజ చేస్తున్న గదిలో ఆమె చేయి పట్టుకుని అత్యాచారయత్నానికి ప్రయత్నించాడు. లైంగిక దాడి చేశాడు. ఆమె తీవ్రంగా ప్రతిఘటించింది. అత‌ని కబంధ హ‌స్తాల నుంచి త‌ప్పించుకుంది. భర్తకు ఈ విష‌యాన్ని తెలియచేసింది.

మాధురి, ప్ర‌కాశ్ అతన్ని పట్టుకోవ‌డానికి ప్రయత్నించగా తప్పించుకున్నాడు. పూజల పేరుతో శ్రీరామ్‌శర్మ తనను శారీరకంగా, మానసికంగా వేధించాడంటూ ఈనెల 14న నాచారం పోలీస్‌స్టేషన్‌లో బాధితురాలు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేర‌కు కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు.

About the author

Related

JOIN THE DISCUSSION