రెండు త‌ల‌ల ర్యాటిల్ స్నేక్

సాధార‌ణంగా రెండు త‌ల‌లు ఉన్న పాములు ఉంటాయి. ఈ ఫొటోలో క‌నిపిస్తున్న‌ది రెండు త‌ల‌ల ర్యాటిల్ స్నేక్‌. చూడ్డానికి ఇది కొండ‌చిలువ‌లా క‌నిపిస్తుంది గానీ.. కొండచిలువ కాదు. అదే జాతికి చెందిన ర్యాటిల్ స్నేక్ అని పిలుస్తార‌ట దీన్ని. ఈ పాముకు రెండు త‌ల‌లు ఉన్నాయి. ఇది విష‌పూరితం.

కాటు వేస్తే ట‌పా క‌ట్టేయాల్సిందే. అమెరికా అర్కాన్స‌స్ స‌మీపంలోని ఫారెస్ట్ సిటీలో క‌నిపించిందీ పాము. ఇది అరుదైన జాతికి చెందిన‌ద‌ట‌. క్వెంటిన్ బ్రౌన్‌, రోడ్నీ కెల్సో అనే పాముల సంర‌క్ష‌కులు ఫారెస్ట్ సిటీలో ఈ పామును ప‌ట్టుకున్నారు. అనంత‌రం దీన్ని అర్కాన్స‌స్ నేచ‌ర్ సెట‌ర్‌కు అంద‌జేశారు. రెండు త‌ల‌లు ఉన్నాయి కాబ‌ట్టి దీనికి డ్యూస్ అని పేరు పెట్టార‌ట‌. ఈ పామును ఫొటో తీసి సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు.

About the author

Related

JOIN THE DISCUSSION