ఇప్పుడు మీరు చూస్తున్న‌ది..జిరాఫీనే!

సందేహాలు అక్క‌ర్లేదు. ఈ ఫొటో కనిపిస్తున్న‌ది జిరాఫీనే. కెన్యా అడ‌వుల్లో క‌నిపించిన తెల్ల‌రంగు జిరాఫీ ఇది. సాధార‌ణంగా బంగారు, గోధుమ రంగుల మిశ్ర‌మంలో క‌నిపించే జిరాఫీల‌కు భిన్నంగా.. తెల్ల‌గా క‌నిపిస్తోంది ఇది. కార‌ణం- జ‌న్యు స‌మ‌స్య‌.

లెవ్‌సిజ‌మ్ అనే జ‌న్యు స‌మ‌స్య వ‌ల్ల రెండు జిరాఫీలు ఇలా తెల్ల‌రంగులోకి మారిపోయాయి. ఈ లెవ్‌సిజ‌మ్ అనే జ‌న్యుప‌ర‌మైన ఇబ్బందులు ప‌క్షులు, జంతువుల్లో క‌నిపిస్తుంటుంది.

కెన్యా గ్యారిస్సా కంట్రీలోని ఇష‌క్‌బిని హిరోలా అడ‌వుల్లో క‌నిపించాయి. ఈ రెండూ త‌మ కంటికి క‌నిపించిన వెంట‌నే కొంద‌రు గ్రామీణులు ఈ విష‌యాన్ని అట‌వీశాఖ సిబ్బందికి తెలియ‌జేశారు.

అలా, అలా అది జీవశాస్త్ర నిపుణుల చెవిన ప‌డింది. దీనిపై వారు ప‌రిశోధ‌న‌లు చేశారు. లెవ్‌సిజ‌మ్ వ‌ల్లే తెల్ల‌గా మారాయని విశ్లేషించారు. గ్రీన్‌పీస్ ఆఫ్రికా అనే స్వ‌చ్ఛంద సంస్థ ఈ వీడియోను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసింది.

About the author

Related

JOIN THE DISCUSSION