ఇదీ మన ప్రభుత్వ ఆసుపత్రుల పరిస్థితి.. శవాలను కూడా కాపాడుకోలేమా..!

మనదేశంలో ప్రభుత్వ ఆసుపత్రుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అందులో ఉండే సదుపాయాలను చూస్తే ప్రాణాలు నిలబడతాయా అన్న సందేహం కలుగుతుంది. అందుకే స్థోమతకు మించైనా ప్రైవేట్ ఆసుపత్రులనే ఆశ్రయిస్తారు. అయితే మన ప్రభుత్వ ఆసుపత్రుల్లో కనీసం చనిపోయిన వారి దేహాలను కూడా కాపాడుకోలేకపోతున్నాం. శవాలను ఎలుకలు పీక్కుతినడం కూడా జరుగుతోంది. అందుకు సాక్ష్యం వరంగల్ లోని ఎంజిఎం ఆసుపత్రే..!

మార్చురీలోని ఓ మృతదేహాం చేతిని ఎలుకలు కొరికి తిన్నాయి. రాచర్ల సంతోష్ అనే వ్యక్తి మృతదేహాన్ని వరంగల్ లోని ఎంజిఎం ఆసుపత్రి మార్చురీలో భద్రపరిచారు. అయితే శనివారం మృతదేహాన్ని చూసిన బంధువులకు ఎలుకలు చేతిని కొరికి ఉండటాన్ని గుర్తించారు. దీనిపై మార్చురీ సిబ్బందిని అడిగితే పొంతనలేని సమాధానాలు ఇచ్చారు. దీంతో బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాణాలకే కాదు.. చనిపోయిన వారి శవాలకు కూడా మన ప్రభుత్వ ఆసుపత్రుల్లో దిక్కు లేదు..!

About the author

Related

JOIN THE DISCUSSION