తనను టీమ్ లోకి తీసుకోలేదన్న కోపంతో జడేజా ట్వీట్.. ఆ తర్వాత డిలీట్..!

ఆస్ట్రేలియాతో జరబోయే మొదటి మూడు వన్డేలకు భారతజట్టును ప్రకటించారు. అయితే అందులో జడేజాకు, అశ్విన్ కు చోటు దక్కలేదు. అయితే జట్టు సభ్యులను ప్రకటించిన తర్వాత జడేజా ఓ ట్వీట్ చేశాడు. చేశాడు బాగానే ఉంది కానీ ఎందుకో డిలీట్ చేశాడు. అదే పలు అనుమానాలకు దారి తీస్తోంది.

జడేజాను శ్రీలంక టూర్ వన్డేలకు పక్కన పెట్టారు. అది రెస్ట్ ఇవ్వడమని అనుకున్నారు. కానీ ఆస్ట్రేలియాతో మొదటి మూడు వన్డేలకు జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు. ఈ నెల 17వ తేదీ నుండి మొదలవ్వనున్న వన్డే సిరీస్ కోసం షమీ, ఉమేష్ యాదవ్ ను జట్టులోకి పిలిపించారు. కానీ జడేజా, అశ్విన్ లకు మాత్రం పిలుపు అందలేదు. 16 మంది జట్టు బృందంలో చోటు దక్కకపోవడంతో ట్వీట్ చేశాడు జడేజా..!

Make your comebacks stronger than your setbacks #rajputboy అంటూ గుర్రంతో ఒక్క ఫోటో పెట్టాడు. తాను తిరిగి జట్టులోకి తప్పకుండా వస్తానని ఆ ట్వీట్ సారాంశం. అయితే పెట్టాడు బాగానే ఉంది కానీ తర్వాత ఎందుకు డిలీట్ చేశాడోనని క్రికెట్ అభిమానులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. శ్రీలంక టూర్ లో యజువేంద్ర చాహల్, కుల్దీప్ చాహల్ రాణించడంతో జడేజాకు చోటు దక్కలేదని అంటున్నారు. చివరి రెండు వన్డేలకు జడేజాను సెలెక్ట్ చేస్తారేమో వేచి చూడాలి.

 

About the author

Related

JOIN THE DISCUSSION