రవీంద్ర జడేజా.. సస్పెండ్..!

రెండో టెస్టులో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచిన రవీంద్ర జడేజాను సస్పెండ్ చేశారు. ఐసీసీ నిబంధనలు ఉల్లంఘించినందుకు ఒక టెస్ట్‌ మ్యాచ్‌ నిషేధానికి గురయ్యాడు. ఈ నెల 12న పల్లెకెలె జరగనున్న మూడో టెస్టుకు జడ్డు దూరమయ్యాడు. 24 నెలల వ్యవధిలో జడేజా ఆరు డీమెరిట్‌‌ పాయింట్లు తెచ్చుకున్నాడు. దీంతో కొరడా ఝుళిపించిన ఐసీసీ.. జడేజాను ఒక టెస్ట్ మ్యాచ్ సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది.

ఇంతకూ ఏమి జరిగింది
మూడో రోజు ఆటలో 58వ ఓవర్‌లో చివరి బంతి వేసిన జడేజా తన చేతిలోకి వచ్చిన బాల్‌ను బ్యాట్స్‌మన్‌ దిముత్‌ కరుణరత్నే వైపు విసిరాడు. అతడు క్రీజ్‌ వదలనప్పటికీ ప్రమాదకరంగా బంతిని విసిరినట్టు ఫీల్డ్‌ అంపైర్లు గుర్తించారు. అది అతనికి తగలలేదు కాబట్టి జడేజా పెద్ద అపప్రద నుండి తప్పించుకున్నాడు. దీంతో జడేజాకు 6 డీమెరిట్‌ పాయింట్లు వచ్చాయి. గతేడాది అక్టోబర్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో నిబంధనలు ఉల్లంఘించడంతో అప్పుడు కూడా అతడికి 3 డీమెరిట్‌ పాయింట్లు వచ్చాయి. 24 నెలల వ్యవధిలో జడేజా ఆరు డీమెరిట్‌‌ పాయింట్లు తెచ్చుకున్న ఆటగాడిని ఐసీసీ శిక్షిస్తుంది. దీంతో జడేజాకు ఒక టెస్ట్ మ్యాచ్ నిషేధం విధించింది. అలాగే మ్యాచ్ ఫీజులో 50 శాతం కోతను విధించారు.

 

About the author

Related

JOIN THE DISCUSSION