రాజమౌళి పుట్టినరోజు అని తెలిసే ఆ పోస్ట్ ఆర్జీవీ పెట్టాడా..?

దర్శకధీరుడు రాజమౌళి పుట్టినరోజు నేడు.. ఆయనకు దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అయితే ఆయన పుట్టినరోజుకు ఒక్క రోజు ముందు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ విషయంలో ఆర్జీవీ ట్వీట్లు చేశాడు.

అదేంటంటే.. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ నిర్మాణం కోసం వందల కోట్లు ఖర్చు చేసి బిల్డింగులు కట్టడం మానేసి.. దాని బదులు ఒక మామూలు బిల్డింగ్ లో గ్రీన్ మ్యాట్ వేసి సభలు నిర్వహించాలని వర్మ సలహా ఇచ్చాడు. ఆ వీడియో ఫుటేజీ రాజమౌళికి సమర్పిస్తే అతను అద్భుతమైన సీజీ.. విజువల్ ఎఫెక్ట్స్ సమకూర్చి టెలికాస్ట్ కు ఇస్తాడని.. అప్పుడది ప్రపంచంలోని అన్ని అసెంబ్లీల కంటే గొప్పగా ఉంటుందని.. బాహుబలియన్ అసెంబ్లీ అవుతుందని అన్నాడు వర్మ.

అయితే ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కౌంటర్ అయినప్పటికీ.. ఇది ఎప్పటిదో మ్యాటర్..! కానీ పనిగట్టుకొని సరిగ్గా రాజమౌళి పుట్టినరోజుకు కొన్ని గంటల ముందే ఈ కామెంట్లు చేయాల్సిన అవసరం ఏముంది. అది కూడా అద్భుతమైన సీజీ, విజువల్ ఎఫెక్ట్స్ అంటూ ఆర్జీవీ ఈ ట్వీట్ చేశాడు.

Instead of wasting crores and crores of rupees on building a great looking Assembly, one Mindblowing idea is for Andhra…

RGVさんの投稿 2017年10月9日(月)

About the author

Related

JOIN THE DISCUSSION