లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రంలో రోజా.. ఆ పాత్రకేనా..?

లక్ష్మీస్ ఎన్టీఆర్.. చిత్ర నిర్మాణానికి ముందే వివాదాలకు కేంద్రబిందువు అవుతోంది. ఇప్పటికే ఎన్టీఆర్ జీవిత చరిత్రను వర్మ గెలుకుతున్నాడని నందమూరి అభిమానులు, తెలుగుదేశం పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ చిత్రానికి వైసీపీ నేత నిర్మాతగా వ్యవహరిస్తున్నాడని తెలియడంతో అది కాస్తా ఇంకా ఎక్కువైంది. అయితే ఇందులో ఓ పాత్ర కోసం వైసీపీ ఎమ్మెల్యే, నటి రోజాను అడిగారట.

ఇప్పటివరకూ రోజాకు ఇవ్వబోయే పాత్ర గురించి క్లారిటీ లేకపోయినా ‘లక్ష్మీ పార్వతి’ పాత్రను ఆమె పోషించబోతోందని టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అదీ కాకుండా వర్మ మంచి పాత్ర అని అన్నాడు కాబట్టి ఆ పాత్ర ఖచ్చితంగా అదే అయి ఉంటుందని చెబుతున్నారు.

రాంగోపాల్ వర్మ మంగళవారం నాడు లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాను నిర్మించనున్న వైసీపీ నేత రాకేష్ రెడ్డి ఇంటికి వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సినిమాలోని పాత్రల కోసం ఇంకా ఎవరినీ ఎంపిక చేయలేదని పేర్కొన్నారు. వైసీపీ ఎమ్మెల్యే రోజాకు కూడా ఇందులో మంచి పాత్ర ఉంటుందని చెప్పారు.

దీనిపై రోజా కూడా స్పందించారు. మంచి పాత్ర ఇస్తే చేసేందుకు సిద్ధమని పేర్కొన్నారు. అయితే వర్మ తనను ఏ పాత్ర కోసం ఎంపిక చేసుకోవాలనుకుంటున్నారో తనకు తెలియదన్నారు. ఆయనను కలిసిన తర్వాత అన్ని వివరాలు వెల్లడిస్తానని పేర్కొన్నారు.

About the author

Related

JOIN THE DISCUSSION