ఏనుగు 15 మందిని పొట్టనపెట్టుకుంది.. హైదరాబాద్ వ్యక్తిని అంతుచూడడానికి పిలిపించారు..!

బీహార్, జార్ఖండ్ రాష్ట్రాల్లో 15 మందిని పొట్టన పెట్టుకున్న ఏనుగును చంపేశారు. ప్రముఖ హైదరాబాదీ షూటర్ నవాబ్ షఫత్ అలీ ఖాన్ ను రప్పించి మరీ ఆ ఏనుగును చంపించాయి జార్ఖండ్, బీహార్ ప్రభుత్వాలు. బీహార్ రాష్ట్రంలో గత నెల మార్చిలో గుంపు నుంచి వేరుపడిపోయింది. ఆ తర్వాత జార్ఖండ్ రాష్ట్రంలోని అడవుల్లోకి ప్రవేశించింది. అప్పటి నుంచి కనిపించిన వారిపై దాడులు చేస్తూనే ఉంది. ఇప్పటి వరకు 15 మందిని చంపింది. కాల్చకుండా మత్తుమందు పెట్టి పట్టుకుందామని ప్రయత్నించారు. అయినప్పటికీ వీలు కాలేదు..! కొద్ది రోజులకు ఆ మదగజం మరికొందరిని చంపే అవకాశం ఉండడంతో కాల్చి చంపాలని అటవీ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. దీంతో హైదరాబాదీ షూటర్ నవాబ్ షఫత్ అలీ ఖాన్ కు కబురు పెట్టారు. శనివారం ప్రపంచ ఏనుగుల దినోత్సవం కాగా, శుక్రవారం రోజున ఏనుగును మట్టుబెట్టారు.

About the author

Related

JOIN THE DISCUSSION