త్వరలో మీ జోబుల్లోకి రానున్న 200రూపాయల నోట్లు..!

పెద్ద నోట్లు చిన్న నోట్ల మధ్య అంతరం తగ్గించేందుకు.. అలాగే దేశంలో చిల్లర సమస్యను తీర్చడానికి 200 రూపాయల నోట్లను ప్రవేశపెట్టనున్నట్లు భారత ప్రభుత్వం బుధవారం నాడు ప్రకటించింది. ఆగస్ట్ చివరి వారంలో లేదా.. సెప్టెంబర్ మొదటి వారంలో కొత్త 200 రూపాయలు ప్రజల చెంతకు చేరుతాయని ఫైనాన్సియల్ మినిస్ట్రీ తెలిపింది.

ఆర్బీఐ త్వరలో కొత్త 50రూపాయల నోట్లను కూడా ప్రవేశపెట్టనున్నట్లు ప్రకటించింది. నవంబర్ 8, 2016న నోట్ల రద్దు ప్రకటించిన తర్వాత కొత్త కొత్త నోట్లను భారత ప్రభుత్వం ప్రవేశపెడుతూ వస్తోంది. పాత 500, 1000 రూపాయలను రద్దు చేసి కొత్త 500 నోట్లను, 2000 రూపాయల నోట్లను ప్రవేశపెట్టింది. ఇప్పుడు కొత్తగా 200, 50 రూపాయల నోట్లను కూడా ప్రజల అవసరార్థం ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టబోతోంది. మైసూరు లోని ఆర్బీఐ పేపర్ మిల్లులో జూన్ నెలలోనే ప్రింటింగ్ మొదలుపెట్టారు. ఆ తర్వాత వాటి ఫోటోలు కూడా బయటకు రావడం జరిగింది.

 

About the author

Related

JOIN THE DISCUSSION