ముంబై అండర్-19 జట్టులో స్థానం సంపాదించిన అర్జున్ టెండూల్కర్.. అతనిలో ఉన్న ట్యాలెంట్ ఏంటంటే..!

క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ కొడుకు క్రికెట్ లో వడివడిగా అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తున్నాడు. అర్జున్ టెండూల్కర్ ఆల్ రౌండర్ గా రాణిస్తూ.. పలు చోట్ల శిక్షణను పొందుతూ రాటుదేలుతున్నాడు. ఇప్పటికే ఇంగ్లాండ్ క్రికెటర్లకు, మహిళా జట్లకు నెట్స్ లో బౌలింగ్ వేస్తూ అప్పుడప్పుడు వార్తల్లో నిలుస్తున్నాడు. తాజాగా అర్జున్ టెండూల్కర్ ముంబై అండర్-19 జట్టులో చోటు సంపాదించుకున్నాడు. జేవై లేలే ఆల్ ఇండియా అండర్-19 ఇన్విటేషనల్ వన్డే టోర్నమెంట్ లో పాల్గొనబోయే ముంబై అండర్-19 జట్టులో అర్జున్ స్థానం సంపాదించాడు. ఈ నెలలో బరోడాలో ఈ టోర్నమెంట్ జరుగుతుంది.

17 సంవత్సరాల అర్జున్ టెండూల్కర్ గతంలో ముంబై అండర్-14, అండర్-16 జట్ల తరపున ఆడాడు. అర్జున్ తన తండ్రిలా బ్యాట్స్మెన్ కాకుండా ఆల్ రౌండర్ గా ఎదగాలని అనుకుంటున్నాడు. లెఫ్ట్ ఆర్మ్ సీమ్ బౌలింగ్ లో అర్జున్ తన ప్రతిభ చాటాలని అనుకుంటున్నాడు. గతంలో ఇంగ్లాండ్ జట్టుకు నెట్స్ లో ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో బెయిర్ స్టో అర్జున్ యార్కర్ దెబ్బకు విలవిలలాడిపోయాడు. ఇక ఈ టోర్నమెంట్ లో అర్జున్ ఏ విధంగా రాణిస్తాడో వేచి చూడాలి. సెప్టెంబర్ 16 నుండి సెప్టెంబర్ 23 వరకూ ఈ టోర్నమెంట్ జరగనుంది.

About the author

Related

JOIN THE DISCUSSION