సమంత అన్నయ్య సినిమా.. ఆగస్టు 11న ఫస్ట్ డే ఫస్ట్ షో అట.. ఇంతకూ ఎవరు ఆ అన్నయ్య..?

సమంత అన్నయ్య సినిమా ఆగస్ట్ 11న విడుదల అవుతోందట.. సమంతకు అన్నయ్య ఎవరు ఉన్నారు.. అప్పుడే హీరోగా కూడా ప్రయత్నాలు మొదలుపెట్టారా అని అనుకోకండి..! ఎందుకంటే అక్కినేని నాగచైతన్యను పెళ్ళి చేసుకోబోయే సమంతకు దగ్గుబాటి ఫ్యామిలీ కూడా బంధువులు అవుతారు. ఇక రానా సోదరుడి వరుస అవుతాడు.. అందుకే సమంత రానాను అన్నయ్య అంటూ పిలిచింది.

రానా నటించిన నేనే రాజు నేనే మంత్రి సినిమాను ప్రమోట్ చేస్తూ ఓ ట్వీట్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. “ఊ.. హూ… నా సూపర్ స్టార్ అన్నయ్య రానా చిత్రం. ఆగస్టు 11న ఫస్ట్ డే ఫస్ట్ షో” అని ట్వీట్ చేసింది. రానా పెద్ద కటౌట్ ఫోటోను పెట్టి తన అభిమానాన్ని చాటుకుంది సమంత. మరో రెండు రోజుల్లో ‘నేనే రాజు నేనే మంత్రి’ చిత్రం విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా చిత్రం విడుదల అవుతున్న థియేటర్ల ముందు రానా లుంగీ కట్టుకుని నోట్లో సిగరెట్ పెట్టుకుని ఉన్న భారీ కటౌట్లు ఏర్పాటు చేశారు. సమంత చేసిన ట్వీట్ కు ఇప్పటికే వేల కొద్దీ లైక్ లు, వందల కొద్దీ రీ ట్వీట్లూ వచ్చాయి.

About the author

Related

JOIN THE DISCUSSION