సంపూ అన్నా.. ఎన్నాళ్ళకెన్నాళ్ళకు

బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు అంటే తెలుగు సినీ అభిమానులకు ప్రత్యేకమైన అభిమానం. టాలెంట్ ఉంటే బ్యాక్ గ్రౌండ్ తో పనిలేదు అని నిరూపించాడు. ఆయన్ను ఆదర్శంగా తీసుకొని ఎందఱో కొత్త కొత్త నటులు టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్నారు. హృదయకాలేయం లాంటి బ్లాక్ బస్టర్ సినిమాను.. సింగం 123 లాంటి పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ సినిమాను తెలుగు ప్రేక్షకులకు అందించాడు. అటువంటి సంపూ సోలో హీరోగా తెరపైన కనిపించి చాలారోజులు అయ్యింది.

కొబ్బరిమట్ట అనే క్రేజీ ప్రాజెక్ట్ ను మొదలుపెట్టిన సంపూ “కొబ్బరి ఆకులు కలగలిపే కొబ్బరిమట్ట కథ” అంటూ ఓ పాటను ఇంటర్నెట్ లో పెట్టారు. ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా విడుదలైన కొబ్బరిమట్ట టీజర్ సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అయ్యింది. సంపూర్ణేష్ బాబు చెప్పిన భారీ డైలాగ్ అద్భుతః అని అందరూ మెచ్చుకున్నారు. టీజర్ విడుదలైంది కదా.. ఇక సినిమానే తరువాయి అని అనుకున్నారు. కానీ ఎన్ని రోజులైనా సంపూ కొబ్బరిమట్ట గురించి సరైన వార్త బయటకు రాలేదు. తాజాగా సంపూ తన అభిమానులకు ఓ శుభవార్త చెప్పారు. కొబ్బరిమట్ట చిత్రంలోని ‘పాపారాయుడు’ పాట టీజర్‌ను ఈ నెల 12 విడుదల చేయనున్నట్లు పోస్టర్ ద్వారా మూవీ టీం వెల్లడించింది. సరికొత్త పోస్టర్స్ లో సంపూ మునుపటికంటే ఎంతో ఎనర్జీతో కనిపిస్తున్నాడు. ఇక ఈ చిత్రం కోసం తెలుగు సినీ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నారు.

About the author

Related

JOIN THE DISCUSSION