సారాహ్ ని విపరీతంగా వాడేశారా.. ఇప్పుడు బాధపడండి..!

సారాహ్ యాప్.. తామెవ్వరో చెప్పకుండా మెసేజీలను పంపొచ్చు.. కొన్ని వారాల క్రిందట ఈ యాప్ ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ లేని ప్రాచుర్యం పొందింది. మిలియన్ల మంది ఈ యాప్ ను డౌన్లోడ్ చేసుకున్నారు. తమ స్నేహితులను ఆటపట్టించడానికి ఎక్కువగా ఈ యాప్ ను ఉపయోగించేవారు..! అయితే ఇదేదో మంచి యాప్ అనుకుని తెగ వాడేసారు.. కానీ వాడిన వారికి ఓ బ్యాడ్ న్యూస్ చెబుతున్నాం వినండి. ఈ యాప్ ఎవరి పర్మిషన్ తీసుకోకుండా కొన్ని సర్వర్ల లోకి మీ కంప్యూటర్లు, ఫోన్లలో ఉన్న సమాచారాన్ని ఎక్కిస్తోంది. అంటే మీ మొబైల్ లో లేదా.. కంప్యూటర్లలో ఉన్న విలువైన సమాచారం వారికి చేరిందన్నమాట..!

ది ఇంటర్సెప్ట్ కథనం ప్రకారం.. ఈ యాప్ కాంటాక్ట్ డీటెయిల్స్, ఈమెయిల్స్ లకు సంబంధించిన మొత్తం సమాచారాన్ని వాటి సర్వర్లలో నిక్షిప్తం చేస్తోంది. కొన్ని కొన్ని సార్లు ఈ ఇన్ఫర్మేషన్ ను మేము యాక్సెస్ చేస్తాము అని మిమ్మల్ని అడిగినప్పటికీ.. మీకు తెలీకుండానే సర్వర్లలోకి అప్లోడ్ చేసేస్తోంది.

జాచరీ జూలియన్ అనే సీనియర్ సెక్యూరిటీ అనలిస్ట్ తన ఆండ్రాయిడ్ ఫోన్ లోకి ఈ యాప్ ను ఇంస్టాల్ చేశాడు. అలాగే ఆ ఫోన్ లోకి బర్ప్ సూట్ అనే యాప్ ను కూడా ఇంస్టాల్ చేశాడు.. ఈ యాప్ మొబైల్ ఫోన్ లో ఇంటర్నెట్ ట్రాఫిక్ ను కనిపెడుతుంది. ఒకానొక సమయంలో మొబైల్ ను వాడకపోయినప్పటికీ ఇంటర్నెట్ వాడకాన్ని అతను గమనించాడు.. అంటే మనకు తెలీకుండా సారా యాప్ డేటాను వేరే సర్వర్లలోకి పంపిస్తోంది. దీనిపై మరి కొన్ని పరీక్షలు చేసిన తర్వాత కూడా సారాహ్ యాప్ డేటాను తస్కరిస్తోందని జూలియన్ స్పష్టం చేశాడు..!

About the author

Related

JOIN THE DISCUSSION