సూసైడ్ నోట్ లో ‘ఐ లవ్ యూ’ అని రాసి.. చెట్టుకు ఉరివేసుకున్న ఇంటర్ విద్యార్థి..!

12వ తరగతి విద్యార్థి ప్రేమలో పడ్డాడు.. ఆమె దక్కకపోవడంతో సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు. ఏమని అనుకుంటోంది ఈతరం..! ఒక్కసారి తల్లిదండ్రుల గురించి.. తన భవిష్యత్తు గురించి ఆలోచించి ఉండి ఉంటే.. ఈ యువకుడు ఇలా చెట్టుకు వేలాడి ఉండేవాడు కాదు.. ప్రేమ అనే పేరుతో ఎందఱో జీవితాలు నాశనం అవుతున్నాయి.. కనీసం అతను ఏ స్థాయిలో ఉన్నాడన్నది కూడా మరచిపోయాడు. తనను పెళ్ళి చేసుకోవాలని ఓ అమ్మాయిని అడుక్కున్నాడు.. దానికి ఆ అమ్మాయి ఒప్పుకోలేదు. నువ్వు లేని ఈ జీవితం వృధా అని సూసైడ్ నోట్ రాసి.. తన పేరు పక్కన ఐ లవ్ యు అని రాసి ఆత్మహత్య చేసుకున్నాడు.

జైసల్మేర్ జిల్లా లోని నాచ్నా గ్రామంలో నివసించే 17 సంవత్సరాల జేఠారామ్ మేఘవాల్.. 12వ తరగతి చదువుతున్నాడు. అంబేద్కర్ హాస్టల్ లో ఉంటూ న్యూ గవర్నమెంట్ స్కూల్ లో చదువుకునే వాడు. శనివారం అర్ధరాత్రి 12 గంటల వరకూ అతను తన సోదరుడు.. మిగిలిన స్నేహితులతో కలసి ఉన్నాడు. ఆ తర్వాత అందరినీ తమ తమ రూముల్లోకి వెళ్ళిపోమని చెప్పాడు. నిద్ర వస్తోందేమోనని అందరూ ఎవరిగాడులకు వాళ్ళు వెళ్ళిపోయారు. ఉదయం అందరూ నిద్ర లేచి హాస్టల్ వెనుకకు వెళ్ళి చూడగా.. చెట్టుకు ఉరి వేసుకుని జేఠారామ్ మేఘవాల్ ఆత్మహత్య చేసుకున్నాడు. వెంటనే పిల్లలు వార్డెన్ కు సమాచారం అందించగా అతను పోలీసులకు ఫోన్ చేశాడు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు అతని రూమ్ ను పరిశీలించగా.. జేఠారామ్ మేఘవాల్ రాసిన ఓ సూసైడ్ నోట్ బయటపడింది.

అందులో అతడు అమ్మాయి పేరు రాసి ఆమెను ఎంతగా ప్రేమించాడో కూడా రాశాడు. తన పేరు పక్కన ఐ లవ్ యు రాసి ఆత్మహత్య చేసుకుంటున్నానని చెప్పాడు. జేఠారామ్ మేఘవాల్ ఎంతగానో ఆ అమ్మాయిని ప్రేమించినట్లు సూసైడ్ నోట్ లో రాశాడు. అమ్మాయి పెళ్ళి చేసుకోడానికి ఒప్పుకోకపోవడంతో ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సూసైడ్ నోట్ లో రాశాడు. కొంచెం కూడా ఆలోచించకుండా.. తలిదండ్రులు ఏమైపోతారో కూడా పట్టించుకోకుండా.. అసలు ప్రేమకు.. ఆకర్షణకు తేడా తెలియకుండా 12వ తరగతి కుర్రాడు ప్రవర్తించడం నిజంగా బాధాకరమైన అంశమే..!

About the author

Related

JOIN THE DISCUSSION