భూమికి రెండు వైపులా భారీ వ‌ర్షాలు: నిబిరు ప్ర‌భావ‌మేనా?

మ‌న భూగోళానికి రోజులు ద‌గ్గ‌ర ప‌డ్డాయ‌నే వార్త‌లు మ‌ళ్లీ పుట్టుకొచ్చాయి. మ‌య‌న్ క్యాలెండ‌ర్ ప్ర‌కారం 2012 డిసెంబ‌ర్ 21, 22, 23 తేదీల్లో భూమండ‌లం అంతం అవుతుందంటూ గ‌తంలో వార్త‌లు విన్నాం.. చుదువుకున్నాం.. టీవీల్లో చ‌ర్చా కార్య‌క్ర‌మాల‌నూ చూశాం. ఆ త‌రువాత అంతా దాని గురించి మ‌రిచేపోయాం.

ఇప్పుడు మ‌ళ్లీ అలాంటి వార్త‌లు ప్ర‌పంచ‌వ్యాప్తంగా పుట్టుకొచ్చాయి. మరో నెల రోజుల్లో భూమి అంతం కావ‌డం ఖాయ‌మ‌ని, ఈలోగా తీరని కోరికలేవైనా ఉంటే తీర్చుకోవాలని సూచిస్తున్నారు కాన్‌స్పిరసీ థియరిస్టులు. ఈ కాన్‌స్పిర‌సీ థియరిస్టుల్లో ప్ర‌ముఖుడు డేవిడ్ మీడ్. ఆయ‌న కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

వచ్చే నెల 20 నుంచి 23 తేదీల మధ్య భూప్రళయం తప్పదని మీడ్ జోస్యం చెబుతున్నారు. దీనికి కార‌ణం ఉంది. నిబిరు అనే గ్ర‌హం భూమిని ఢీ కొట్ట‌బోతోంద‌నేది ఆయ‌న వాద‌న. వ‌చ్చేనెల 20, 21, 22, 23 తేదీల్లో నిబిరు గ్ర‌హం భూమిని ఢీ కొట్ట‌డం ఖాయ‌మ‌ని, దీనికి సంబంధించిన కొన్ని ర‌హ‌స్య‌, కీలక ప‌త్రాల‌ను తాను ప్ర‌త్య‌క్షంగా చూశాన‌నీ ఆయ‌న చెబుతున్నారు.

నిబిరు ఢీ కొట్టిన త‌రువాత భూమి బ‌ద్ద‌లైపోతుంద‌ని అంటున్నారు. మ‌య‌న్ క్యాలెండ‌ర్ విష‌యం ఎలా ఉన్న‌ప్ప‌టికీ.. బైబిల్, ఈజిప్టులోని గిజా పిరమిడ్ లోను దీనికి సంబంధించి స్పష్టమైన ఆధారాలున్నాయని మీడ్ తెలిపారు. గ‌తంలోనూ నిబిరు మీద మీడియాలో వార్త‌లొచ్చాయి.

మ‌న తెలుగు మీడియాలోనూ ప్ర‌ముఖంగా దీనిపై చ‌ర్చ సాగింది. ఇదే నిబిరు గ్ర‌హం సెప్టెంబర్ రెండో వారం భూమికి మ‌రింత చేరువ‌గా వ‌స్తుంద‌ని, దీన్ని స్పష్టంగా చూడొచ్చ‌నీ చెబుతున్నారు.

ఈ గ్ర‌హ ప్ర‌భావం వ‌ల్లే భూగోళానికి రెండు వైపులా అంటే ఒక పార్శ్యంలో ఉన్న అమెరికాలో, ఇంకో పార్శ్యంలో ఉన్న ఆసియా ఖండంలో భారీ నుంచి అతి భారీ వ‌ర్షాలు కురుస్తున్నాయ‌నే కొత్త వాద‌న తెర‌మీదికి వ‌చ్చింది. అటు పాకిస్తాన్‌లోనూ అసాధార‌ణంగా వ‌ర్షాలు కురుస్తున్నాయి. మొన్న‌టికి మొన్న హాంగ్‌కాంగ్‌, చైనాలోనూ ఇదే ప‌రిస్థితి త‌లెత్తింది. దీనికంత‌టికీ కార‌ణం నిబిరు భూమిని స‌మీపిస్తుండ‌ట‌మేన‌నే వాద‌న మ‌ళ్లీ మొల‌కెత్తింది.

About the author

Related

JOIN THE DISCUSSION