బ‌స్సు ప్ర‌మాదం..సీసీ కెమెరాలో: సీట్ బెల్టే వారిని కాపాడింది!

ద్విచ‌క్ర వాహ‌నాన్ని న‌డిపేట‌ప్పుడు హెల్మెట్‌.. కారును న‌డిపే స‌మ‌యంలో సీట్ బెల్ట్ పెట్టుకోవ‌డం ఎంత అవ‌స‌ర‌మో తెలియ‌జెప్పే క‌థ‌నం ఇది. చైనాలో చోటు చేసుకున్న ఓ రోడ్డు ప్ర‌మాదానికి సంబంధించిన దృశ్యాలివి.

ప్రయాణికులతో వెళ్తున్న బస్సును ఓ కారు ఢీకొట్టింది. బస్సును నియంత్రించ‌లేక‌పోయాడు డ్రైవ‌ర్‌. దీనితో అది కాస్తా రోడ్డు మీదే బోల్తా పడింది. ఈ ఘటనలో ఒక్కరు మాత్రమే గాయపడ్డారు. సీటు బెల్ట్‌ పెట్టుకోవడంతో మిగతా వారంతా సురక్షితంగా బయటపడ్డారు.

సీట్ బెల్టు పెట్టుకోవ‌డం వ‌ల్ల ఎవ‌రి సీట్ల‌లో వారు అతుక్కుపోయారు. అది పెట్టుకోని వాళ్లు ఎగిరి కింద ప‌డ్డారు. చైనాలోని జుఝౌ ప్రాంతంలో అక్టోబర్‌ 1న సంభ‌వించిన ప్ర‌మాదం ఇది.ఈ ఘటనకు సంబంధించిన సీసీ టీవీ ఫుటేజీ వీడియోను రష్యాకు చెందిన ఆర్ టీ మీడియా సంస్థ యూట్యూబ్‌లో పోస్టుచేసింది.

About the author

Related

JOIN THE DISCUSSION