ఇదేం ప‌ని బాబాయ్‌! ఆరేళ్ల చిన్నారిపై ఘాతుకం!

త‌న సొంత సోద‌రుడి కుమార్తెను అప‌హ‌రించాడో కిరాత‌కుడు. బాధిత చిన్నారికి అత‌ను స్వ‌యానా బాబాయ్‌. అయిన‌ప్ప‌టికీ.. ఆ చిన్నారిపై లైంగిక దాడికి పాల్ప‌డ్డాడు. గొంతు నులిమి హత్యచేశాడు. ఈ ఘ‌ట‌న సంగారెడ్డి జిల్లా మొగడంపల్లి మండలం మన్నాపూర్‌లో చోటు చేసుకుంది. మ‌న్నాపూర్‌కు చెందిన ఆంజనేయులు, స్వప్న కుమార్తె సాయి ప్రియాంక. వ‌య‌స్సు ఆరేళ్లు. ఆంజ‌నేయులు సోద‌రుడు శివకుమార్.

అత‌ను టీనేజ్ కుర్రాడు. 19 సంవ‌త్స‌రాల శివ‌కుమార్ సాయి ప్రియాంక‌ను అప‌హ‌రించాడు. ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. మ‌న్నాపూర్‌లో ప్రభుత్వ పాఠశాలలో రెండో తరగతి చదువుతున్న సాయిప్రియాంక బుధవారం ఉద‌యం ఎప్ప‌ట్లాగే స్కూలుకు వెళ్లింది. సాయంత్రం ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళ‌న‌కు గురయ్యారు. అన్నిచోట్లా వెదికారు. ఫ‌లితం రాలేదు.

దీనితో వారు చిరాగ్‌పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో బాలికను శివకుమార్‌తో కలిసి చూసినట్లు కొందరు స్థానికులు పోలీసులకు తెలిపారు. దీనితో పోలీసులు అత‌ణ్ణి అదుపులోకి విచారించ‌గా.. అస‌లు విష‌యం బ‌య‌ట‌ప‌డింది.

సాయి ప్రియాంక‌పై రెండుసార్లు అత్యాచారానికి పాల్పడి గొంతు నులిమి చంపేసిన‌ట్లు అంగీక‌రించాడు. గ్రామ శివారులోని వ్యవసాయ బావిలో మృతదేహాన్ని పడేసినట్లు చెప్పాడు. పోలీసులు గ్రామస్థుల సాయంతో మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం జహీరాబాద్‌ ఆస్పత్రికి తరలించారు. నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

About the author

Related

JOIN THE DISCUSSION