వీడియో: బాడీ బిల్డర్.. అందరూ చూస్తుండగానే చనిపోయాడు..!

స్టేడియంలో అందరి ముందూ తన బాడీని ప్రదర్శించి.. ఛాంపియన్ గా నిలవాలన్న ఆరాటం..! అలాగని అతనికి ఇదేమీ మొదటి ప్రదర్శన కాదు. అప్పటికే 75 కిలోల కేటగిరిలో ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ బాడీ బిల్డింగ్ అండ్ ఫిట్ నెస్ (ఐఎఫ్ బీబీ) జూనియర్ వరల్డ్ ఛాంపియన్ గా కూడా నిలిచాడు. కానీ కొద్ది క్షణాల్లో అతని జీవితం తలక్రిందులైంది. బ్యాక్ ఫ్లిప్ చేసి అక్కడున్న ప్రేక్షకుల్ని అలరించాలని అనుకున్న అతను ప్రాణాలు కోల్పోయాడు.

23 సంవత్సరాల లున్జెలో తబేత్ జీవితం ఇలా అర్ధాంతరంగా ముగిసిపోయింది. దక్షిణాఫ్రికాకు చెందిన తబేత్ జూనియర్ వరల్డ్ ఛాంపియన్ షిప్ పోటీల్లో భాగంగా జిమ్నాస్టిక్ స్టేడియంలో బ్యాక్ ఫ్లిప్ చేయాలని అనుకున్నాడు. అలా ఎగిరిన తబేత్ కిందకు ల్యాండ్ అయ్యే సందర్భంలో బ్యాలెన్స్ కోల్పోయి కుప్పకూలిపోయాడు. అతని శరీరం బరువు మొత్తం అతని మెడ మీదనే పడిపోయింది. చూస్తున్న వారంతా లేస్తాడని భావించారు. కానీ అలా జరగలేదు. మ్యాట్ మధ్యలోకి వెళ్లి వెనుక వైపు నుంచి గాల్లోకి ఎగిరి ల్యాండ్ అవుతుండగా బ్యాలెన్స్ తప్పడంతో, అతని బరువు మొత్తం మెడ భాగంలో పడటంతో ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. ఆసుపత్రికి తరలించేటప్పటికే అతను మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు.

https://www.youtube.com/watch?v=xyXGCwLzppQ

About the author

Related

JOIN THE DISCUSSION