రెండు చేతులా బౌలింగ్‌..!

రెండు చేతులా సంపాదించే వాళ్లుంటారు గానీ, ఈ రెండు చేతులా బౌలింగ్ వేయ‌డ‌మేంట‌ని అనుకుంటున్నారా? అలాంటి బౌల‌ర్ దొరికాడు. అత‌ను మనోడే. మ‌హారాష్ట్రీయుడు. అత‌ని పేరు అక్ష‌య్ క‌ర్నేక‌ర్‌. స్పిన్న‌ర్‌. కుడి, ఎడమ చేతుల వాటం గ‌ల స్పిన్న‌ర్‌. విద‌ర్భ త‌ర‌ఫున ఆడుతుంటాడు.

చెన్నైలోని ఎం ఎ చిదంబ‌రం స్టేడియంలో ఆస్ట్రేలియాతో జ‌రుగుతున్న వార్మ‌ప్ మ్యాచ్‌లో అక్ష‌య్.. త‌న బౌలింగ్ వైవిధ్యాన్ని ప్ర‌ద‌ర్శించాడు. కుడి, ఎడ‌మ చేతుల‌తో బౌలింగ్ చేశాడు.

కుడి చేతి వాటం బ్యాట్స్‌మెన్‌కు ఎడ‌మ చేత్తో, ఎడం చేతి బ్యాట్స్‌మెన్‌కు కుడి చేత్తో బౌలింగ్ వేస్తూ ఆక‌ట్టుకున్నాడు. బోర్డ్ ప్రెసిడెంట్ లెవెన్ త‌ర‌ఫున ఆడ‌టం అక్ష‌య్‌కు ఇదే మొదటిసారి. ఈ వార్మ‌ప్ మ్యాచ్‌లో ఆసీస్ అద‌ర‌గొట్టిందంతే.

 

50 ఓవ‌ర్ల‌లో ఏడు వికెట్ల న‌ష్టానికి 347 ప‌రుగులు సాధించింది. కేప్టెన్ స్టీవ్ స్మిత్‌, డేవిడ్ వార్న‌ర్‌, ట్ర‌విస్ హెడ్‌, మార్క‌స్ స్టోయినిస్ అర్ధ‌సెంచ‌రీలు చేశారు. దీనితో ఆసీస్ బ్యాట్స్‌మెన్లు బోర్డు ప్రెసిడెంట్ లెవెన్ ముందు భారీ ల‌క్ష్యాన్ని ఉంచ‌గ‌లిగారు.

About the author

Related

JOIN THE DISCUSSION