ఆనందంగా ఉండాలంటే భ‌య‌మేస్తోంది..అందుకే!

`నేను సంతోషంగా ఉండ‌టాన్ని ఎదుటివారెవ‌రూ భ‌రించ‌లేక‌పోతున్నారు. ఆనందంగా ఉండాలంటేనే భ‌య‌మేసే ప‌రిస్థితి నెల‌కొంది. నేను సంతోషంగా ఉండ‌టాన్ని ప్ర‌జ‌లు ఎందుకు చూడ‌లేక‌పోతున్నారు. నా జీవితంలో ప్ర‌తి చిన్న విష‌యం కూడా దుర్భ‌రంగా త‌యారైంది..` అంటూ ఓ విద్యార్థిని ఆత్మ‌హ‌త్య చేసుకుంది.

తాను బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్ప‌డ‌బోయే ముందు- వాట్స‌ప్‌లో స్టేటస్‌ను అప్‌లోడ్ చేసింది. ఆ స్టేట‌స్‌ను చ‌దివిన వారెవ‌రికైనా క‌ళ్లు చెమ్మ‌గిల్ల‌కమాన‌వు. హైద‌రాబాద్ శివార్ల‌లోని దుండిగ‌ల్ పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో చోటు చేసుకున్న ఘ‌ట‌న‌.

ఆ విద్యార్థిని పేరు మౌనిక‌. సూరారం కాల‌నీలో నివాసం ఉంటోంది. ఆమె త‌ల్లిదండ్రులు చంద్రం, రేణుక‌ ఏపీలోని ప‌శ్చిమ‌ గోదావ‌రి జిల్లాకు చెందిన వారు. దాదాపు 20 ఏళ్ల కింద‌ట న‌గ‌రానికి వచ్చి.. ఇక్క‌డే స్థిర‌ప‌డ్డారు.

కుటుంబ క‌ల‌హాల నేప‌థ్యంలో త‌ల్లిదండ్రులు విడివిడిగా ఉంటున్నారు. మౌనిక, ఆమె సోద‌రుడు రేణుక వ‌ద్ద ఉంటున్నారు. మౌనిక న‌ర‌సింహా రెడ్డి ఇంజినీరింగ్ క‌ళాశాల‌లో బీటెక్ ఫైన‌లియ‌ర్ చ‌దువుతోంది. ఈ ఒక్క ఏడాది గ‌డిస్తే.. ఆమె చ‌దువు పూర్త‌వుతుంది.

ప్ర‌తిభావంతురాలు కావ‌డంతో ఉద్యోగం సుల‌భంగానే వ‌చ్చి ఉండేద‌ని స్నేహితులు చెబుతున్నారు. చ‌దువుల్లో చురుకుగా ఉండేదని అంటున్నారు. కొంత‌కాలంగా ముభావంగా ఉండేద‌ని చెప్పారు. బుధ‌వారం రాత్రి ఇంట్లో అంద‌రూ నిద్రిస్తున్న స‌మ‌యంలో.. త‌న గ‌దిలో ఫ్యానుకు ఉరి వేసుకుని మౌనిక ఆత్మ‌హ‌త్య చేసుకుంది.

తెల్ల‌వారిన ఫ్యాన్‌కు వేలాడుతున్న మౌనిక‌ను చూసిన రేణుక గుండెలు బాదుకుంది. ఆమె సోద‌రుడు దుండిగ‌ల్ పోలీసుల‌కు స‌మాచారం ఇచ్చాడు. స‌మాచారం అందుకున్న వెంట‌నే సంఘ‌ట‌నాస్థ‌లానిక చేరుకున్న పోలీసులు మృత‌దేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.

మొబైల్ ఫోన్‌లో ప‌రిశీలించ‌గా.. ఆమె అప్‌లోడ్ చేసిన స్టేటస్ క‌నిపించింది. కుటుంబ క‌ల‌హాల వ‌ల్లే మౌనిక ఆత్మ‌హ‌త్య చేసుకుని ఉంటుంద‌ని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేస్తున్నారు.

About the author

Related

JOIN THE DISCUSSION