ఆమె కాదు.. అత‌ను: ఎవ‌రా హీరో..!

ఈ ఫొటోలో ఉన్న హీరోను గుర్తు పట్టగ‌ల‌రా? అత‌ను తమిళ న‌టుడు. ఒక‌ట్రెండు డ‌బ్బింగ్ సినిమాల‌తో మ‌న తెలుగు ప్రేక్ష‌కుల‌కూ ప‌ల‌క‌రించాడు. కూడా. అంతేకాదు- మెగాస్టార్ న‌టిస్తోన్న 151వ చిత్రం `సైరా`లోనూ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నాడు. అత‌నే విజ‌య్ సేతుప‌తి. ‘పిజ్జా’, ‘నేనూ రౌడీనే’ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు కూడా ఆయన సుపరిచితుడే.

ఇటీవల ‘విక్రమ్‌వేధ’ చిత్రంతో బాక్సీఫీస్‌ వద్ద ఘన విజయాన్ని అందుకున్నారు. విజయ్‌ సేతుపతి న‌టిస్తోన్న కొత్త మూవీ `96`. ప్రేమ్‌ కుమార్ ద‌ర్శ‌కుడు. సేతుప‌తి స‌ర‌స‌న త్రిష హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఈ చిత్ర షూటింగ్‌ శరవేగంగా కొన‌సాగుతోంది. ఇందులో విజయ్‌ సేతపతి ఓ మహిళ వేషంలో కనిపించనున్నారు. ‘శిల్ప’ అనే పాత్రను ఆయన పోషిస్తున్నారు.

 

About the author

Related

JOIN THE DISCUSSION