క‌బ్జాలా జాబితాలో మ‌రో టీడీపీ ఎమ్మెల్యే

క‌బ్జాలా జాబితాలో మ‌రో టీడీపీ ఎమ్మెల్యే

అన‌కాప‌ల్లి టీడీపీ ఎమ్మెల్యే పీలా గోవింద స‌త్య‌నారాయ‌ణ క‌బ్జా ఆరోప‌ణ‌ల‌ను ఎదుర్కొంటున్నారు. ఒమ‌న్‌లో నివ‌సిస్తోన్న రాజేశ్ అనే వ్య‌క్తికి చెందిన స్థ‌లాన్ని ఎమ్మెల్యే పీలా క‌బ్జా చేసిన‌ట్లు కేసు న‌మోదైంది. ఒమ‌న్ నుంచి ఇమెయిల్ ద్వారా పోలీస్ క‌మిష‌న‌ర్‌కు ఆయ‌న ఫిర్యాదు చేశారు.

దీనిపై స్పందించిన పోలీస్ క‌మిష‌న‌ర్.. ఎమ్మెల్యేపై కేసు న‌మోదు చేయాల‌ని ఆదేశించారు. క‌బ్జా ఆరోప‌ణ‌ల‌ను పీలా కొట్టి పారేస్తున్నారు. తాను ఎలాంటి క‌బ్జాల‌కు పాల్ప‌డ‌లేద‌ని, ఆ అవ‌స‌రం త‌న‌కు లేద‌ని చెప్పారు. దీనిపై పీలా కాస్త రెండు క‌ళ్ల సిద్ధాంతాన్ని పాటించారు. ఎవ్వ‌రైనా, ఎక్క‌డి నుంచైనా, ఎవ‌రిపైనా ఫిర్యాదు చేసే హ‌క్కు ఉంద‌ని చెప్పిన‌ పీలా.. అదే స‌మ‌యంలో- ఇమెయిల్ ద్వారా ఫిర్యాదు చేస్తే ఎలా కేసు న‌మోదు చేస్తారని ప్ర‌శ్నిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *