భారత్ లో నెలకు 1.5లక్షల రూపాయలు సంపాదిస్తున్నా.. విదేశాల్లో ఇంకా ఎక్కువ సంపాదించాలని..!

భారత్ లో నెలకు 1.5 లక్షల రూపాయల జీతం అందుకుంటున్నాడు.. కానీ అతను విదేశాల్లో ఇంకా ఎక్కువ సంపాదించవచ్చని అనుకున్నాడు. విదేశాలకు వెళ్ళాలని ఫిక్స్ అయ్యాడు.. కానీ అతను చేసిన ఓ తప్పుడు పని వలన ఇప్పుడు ఊచలు లెక్కపెడుతున్నాడు.. ఇది ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ జీవితంలో చోటుచేసుకున్న ఘటన..!

ముంబై పోలీసులు ఇటీవల ఓ ఐటీ ప్రొఫెషనల్ ను కస్టడీ లోకి తీసుకున్నారు. ఇప్పటికే అతనికి ఓ పాస్ పోర్ట్ ఉంది.. దాంతో ఓ డజన్ కు పైగా దేశాలు చుట్టేసివచ్చాడు కూడా..! కానీ కొత్త పాస్ పోర్ట్ కోసం అప్లయ్ చేశాడు.. అయితే అందులో అతని వయసును 38 నుండి 32 చేసి చూపించాలని ప్రయత్నించాడు. అందుకోసం ఫోర్జరీ డాక్యుమెంట్లను కూడా వాడేశాడు. బర్త్ సర్టిఫికేట్ కూడా తప్పుగా పెట్టాడు. దీంతో డౌట్ వచ్చిన పోలీసులు ఈ విషయం మీద విచారణ మొదలుపెట్టారు.

అప్పుడు తెలిసింది.. అతను అమెరికాలో సాఫ్ట్వేర్ జాబ్ చేయాలని అనుకున్నాడని.. భారత్ లో నెలకు 1.5 లక్షల జీతం అతనికి అందుతోంది. అదే అమెరికాకు వెళ్తే ఇంకా ఎక్కువ డబ్బులు ఇస్తారని.. హ్యాపీగా బ్రతికేయోచ్చని అనుకున్నాడు. అయితే వయసు తక్కువగా ఉన్నట్లు చూపితే జాబ్ త్వరగా రావడమే కాకుండా.. ఎక్కువ రోజులు ఉద్యోగం చేసే అవకాశం ఉందని భావించాడు. అలా కక్కుర్తి పడడం వలన అతను ముందు ఉన్న పాస్ పోర్ట్ ను కాదనుకొని కొత్తది తెచ్చుకోవాలని యత్నించాడు. ముందు కంటే అయిదు సంవత్సరాలు తక్కువ ఏజ్ చూపించాడు. పోలీసులు అతని ఇంటికి వెళ్ళినప్పుడు తాను మొదటిసారి పాస్ పోర్ట్ కోసం అప్లయ్ చేసుకున్నానని.. తాను గతంలో ఎక్కడికీ వెళ్ళలేదని బుకాయించాడు. కానీ పోలీసులు నాలుగు తగిలించడంతో మొత్తం బయటకు కక్కాడు..! అది కూడా అతను పలు దేశాలు తిరిగింది కంపెనీ పని మీదనే.. అవేవీ పట్టించుకోకుండా తప్పుడు దారిలో విదేశాలకు వెళ్ళాలని అనుకున్నాడు.. ఇప్పుడు జైలు లో ఊచలు లెక్కబెడుతున్నాడు.

About the author

Related

JOIN THE DISCUSSION