పిల్ల‌లు పుట్ట‌ట్లేద‌ని న‌గ్నంగా క్షుద్ర పూజ‌లు చేశారు..

పిల్ల‌లు పుట్ట‌ట్లేద‌ని న‌గ్నంగా క్షుద్ర‌పూజ‌లు చేసిన ఘ‌ట‌న తెలంగాణ‌లో క‌ల‌క‌లం రేపింది. వ‌రంగ‌ల్ రూర‌ల్ జిల్లా వ‌ర్ధ‌న్న‌పేట స‌మీపంలో చోటు చేసుకున్న ఈ ఉదంతం.. శాస్త్ర‌, సాంకేతిక రంగాల్లో మ‌న ఉనికిని ప్ర‌శ్నిస్తోంది. సంతానం కలగ‌ట్లేద‌ని కొంత మంది మహిళలను గ్రామ శివార్లకు తీసుకెళ్లి నగ్నంగా క్షుద్రపూజలు నిర్వహించారు కొంద‌రు మంత్రగాళ్లు.

స‌కాలంలో ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు క్షుద్రపూజలను అడ్డుకుని ఇద్దరు మంత్రగాళ్లను సహా అయిదుమంది మహిళలను అదుపులోకి తీసుకున్నారు. మహబూబాబాద్‌ జిల్లా పెద్దవంగరకు చెందిన అయిదుమంది మ‌హిళ‌లకు పెళ్ల‌యి చాలారోజులైన‌ప్ప‌టికీ.. పిల్ల‌లు పుట్ట‌లేదు.

దీనితో వాళ్లు అనాగ‌రిక ప‌నుల‌కు పూనుకున్నారు. మంత్రాల ద్వారా పిల్ల‌లు పుడ‌తార‌ని పర్వతగిరికి చెందిన ఓ మహిళ వారికి సూచించింది. న‌గ్నంగా, క్షుద్ర‌పూజ‌లు చేయాల‌ని ఆదేశించింది. దీనితో- ఆ మ‌హిళ త‌న‌కు తెలిసిన ఓ మంత్ర‌గాడిని సంప్ర‌దించింది.

అత‌ని స‌హ‌కారంతో వ‌ర్ధ‌న్న‌పేట్ స‌మీపంలో ఎస్సారెస్పీ కాలువ వద్దకు బాధిత మ‌హిళ‌ల‌ను పిలిపించి ప్రత్యేక పూజలను చేప‌ట్టింది. వారిని నగ్నంగా చేసి మంత్రాలు చదివిస్తుండగా..స్థానికులు ఈ విష‌యాన్ని గుర్తించారు.

స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. స‌మాచారం అందుకున్న వెంట‌నే రంగంలోకి దిగిన వర్ధన్నపేట సీఐ ఆదినారాయణ సంఘటనా స్థలానికి చేరుకొని వారిని అదుపులోకి తీసుకున్నారు. మంత్రాలు చేస్తున్న ఇద్దరిలో ఓ మహిళతో పాటు ఓ పురుషుడు ఉన్నాడు.

About the author

Related

JOIN THE DISCUSSION