న‌టుడు చిన్నా భార్య క‌న్నుమూత‌

ప్ర‌ముఖ న‌టుడు, ద‌ర్శ‌కుడు చిన్నా భార్య శిరీష కన్నుమూశారు. ఆమె వ‌య‌స్సు 42 సంవ‌త్స‌రాలు. చిన్నా దంప‌తుల‌కు ఇద్ద‌రు కుమార్తెలు.
రెండు రోజులుగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న శిరీష హైదరాబాద్ జూబ్లీహిల్స్ అపోలో ఆసుప‌త్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఆమె ఆరోగ్య ప‌రిస్థితి విష‌మించ‌డంతో మంగ‌ళ‌వారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు.

రామ్‌గోపాల్ వర్మ ఫస్ట్ మూవీ శివతో చిన్నా తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌కు ప‌రిచ‌యం అయ్యారు. ఆ తర్వాత చాలా సినిమాల్లో నటించాడు. కామెడీ పాత్రలు చేశాడు.`ఆ ఇంట్లో` అనే సినిమాకు చిన్నా దర్శకత్వం వహించాడు. బుల్లితెర ప్రేక్ష‌కులనూ ఆయ‌న ఆక‌ట్టుకున్నారు. టీవీ సీరియల్స్ నటించాడు. శిరీష మరణంతో విషాదంలో ఉన్న చిన్నా కుటుంబాన్ని పలువురు సినీ ప్రముఖులు పరామర్శించారు. సంతాపం తెలిపారు.

About the author

Related

JOIN THE DISCUSSION