ఆ కామెడీ షోలో ఇక ర‌ష్మీని చూడ‌లేం..ఆమె స్థానంలో కొత్త యాంక‌ర్ ఎవ‌రంటే..!

టీవీ షోల నుంచి సినిమాల వైపు అడుగులేస్తున్న టాప్ యాంక‌ర్ ర‌ష్మీ గౌత‌మ్‌. అదే ఆమెకు చిక్కుల‌ను తెచ్చిపెట్టిన‌ట్టుంది. జ‌బ‌ర్ద‌స్త్ కామెడీ షో నుంచి ర‌ష్మీని త‌ప్పించార‌ట‌. ఆమె స్థానంలో మ‌రొక‌ర్ని యాంక‌ర్‌గా తీసుకున్న‌ట్లు బుల్లితెర వ‌ర్గాలు చెబుతున్నాయి.

ఆ మ‌రొక‌రు వేరెవ‌రో కాదు.. హ‌రితేజ‌. మొన్న‌టి బిగ్‌బాస్ రియాలిటీ షోలో ఫైన‌లిస్ట్‌గా నిలిచింది హ‌రితేజ. బిగ్‌బాస్ హౌస్‌లో ఉన్న‌ప్పుడు హ‌రితేజ ఓవ‌రాక్ష‌న్ చేసిన‌ట్టు విమ‌ర్శ‌లు ఉన్న‌ప్ప‌టికీ.. అవ‌కాశాల‌ను మాత్రం వ‌చ్చేస్తున్నాయి.

హరితేజ సైతం జబర్దస్త్ షో కార్య‌క్ర‌మానికి యాంక‌ర్‌గా రాబోతోంది. ఈ నేపథ్యంలో మల్లెమాల ప్రొడక్షన్ నిర్వహిస్తున్న జబర్దస్త్‌ షో కు హరితేజను యాంకర్‌గా తీసుకొన్నారని చెబుతున్నారు.

ప్రేక్షకుల ఆదరణ దృష్టిలో పెట్టుకొని హరితేజ కూడా దీనికి అంగీకరించినట్లు సమాచారం. కొద్ది ఏళ్ల నుంచి రష్మీ ఈ షోకు యాంకర్‌గా చేస్తోంది. కొంత కాలంగా జబర్దస్త్ పై వస్తున్న విమర్శలు, హరితేజ ఫాలోయింగ్ ని దృష్టిలో ఉంచుకొని మల్లెమాల సంస్థ హరితేజకు యాంకర్‌గా అవకాశం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

About the author

Related

JOIN THE DISCUSSION