ఐదు సంవత్సరాల అవార్డుల పండుగ త్వరలో

గతకొన్నేళ్ళుగా ఆగిపోయిన ఎన్టీఆర్‌, రఘుపతి వెంకయ్య, బీఎన్‌రెడ్డి, నాగిరెడ్డి-చక్రపాణి జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవం మరోసారి నిర్వహించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుకొచ్చింది. ఈ అవార్డులను మంగళవారం సాయంత్రం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రకటించింది. అవార్డు గ్రహీతల వివరాలను సినీనటులు బాలకృష్ణ, మురళీ మోహన్‌ ప్రకటించారు. 2014, 15, 16 సంవత్సరాలకు సంబంధించిన అవార్డులను త్వరలో ప్రకటిస్తామని మురళీమోహన్‌ తెలిపారు. ఈ ఐదేళ్ల అవార్డులను ఒకేసారి ఘనంగా ప్రదానం చేస్తామన్నారు.

ఎన్టీఆర్‌ జాతీయ‌ చలనచిత్ర అవార్డు 2012- ఎస్పీ బాలసుబ్రమణ్యం


ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు 2013- హేమమాలిని


బీఎన్‌రెడ్డి అవార్డు 2012-సింగీతం శ్రీనివాసరావు


బీఎన్‌రెడ్డి అవార్డు 2013 -కోదండ రామిరెడ్డి


రఘుపతి వెంకయ్య అవార్డు 2012- కోడి రామకృష్ణ


రఘుపతి వెంకయ్య అవార్డు 2013- వాణిశ్రీ


నాగిరెడ్డి- చక్రపాణి జాతీయ చలనచిత్ర అవార్డు 2012- డి.సురేశ్‌బాబు


నాగిరెడ్డి-చక్రపాణి జాతీయ చలనచిత్ర అవార్డు 2013- దిల్‌రాజు

About the author

Related

JOIN THE DISCUSSION