వెన్నుపై `ఓం న‌మఃశివాయః..`

శ‌రీరంపై ప‌చ్చ‌బొట్టు పొడిపించుకోవ‌డం ఆన‌వాయితే. చాలామంది చాలార‌కాలుగా ఒంటిపై చాలాచోట్ల ప‌చ్చ‌బొట్ల‌ను పొడిపించుకుంటుంటారు. దాన్నే ఇంగ్లీషులో టాటూ అంటార‌నుకోండి అది వేరే విష‌యం.

ఇంగ్లండ్‌కు చెందిన ఆర్సెన‌ల్ ఫుట్‌బాల్ క్ల‌బ్ ఆట‌గాడు థియో వాల్‌కోట్‌.. త‌న వెన్నెముక‌పై ఓం న‌మఃశివాయః అనే ప‌చ్చబొట్టు పొడిపించుకున్నాడు. సంస్కృతంలో రాసి ఉన్నాయా అక్ష‌రాలు. ఇందులో అక్ష‌ర దోషం ఉంది. శివాయః అనే ప‌దానికి ఇచ్చే గుడి పైనుంది. దీనితో అర్థ‌మే మారిపోయింది.

శివాయః కాస్త శ‌వాయః అయ్యింది. ఏదేమైన‌ప్ప‌టికీ.. `ఓం న‌మఃశివాయః` అనే ప‌దంలో శ‌క్తిని థియో వాల్‌కోట్ గుర్తించాడు. అందుకే- ఆ అక్ష‌రాల‌ను త‌న వెన్నెముక‌పై ప‌చ్చ‌బొట్టు రూపంలో పొడిపించుకున్నాడు.

దాని ప‌వ‌ర్ ఏమిటో మ‌నకు ప్ర‌త్యేకించి చెప్పాల్సిన ప‌ని లేదు. భార‌తీయ సంస్కృతి, సంప్ర‌దాయాలు, హైంద‌వ ఆచార వ్య‌వ‌హారాలు తెలిసిన వారెవ‌రైనా ముగ్ధులైపోక త‌ప్ప‌దు. ఆ ఫొటోను త‌న ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేశాడు.

About the author

Related

JOIN THE DISCUSSION