ఆ టెకీకి చీర క‌ట్టుకోవ‌డ‌మంటేనే ఇష్టం

ఆ టెకీకి చీర క‌ట్టుకోవ‌డ‌మంటేనే ఇష్టం

నా భ‌ర్త‌తో విసిగిపోయా! విడాకులిప్పించండంటూ ఓ యువ‌తి లాయ‌ర్‌ను ఆశ్ర‌యించింది. బెంగ‌ళూరుకు చెందిన ఆమె ఇందుకు చెప్పిన కార‌ణం వింటే ఆశ్చ‌ర్యం క‌ల‌గ‌క మాన‌దు. ఏడాది క్రితం వివాహ‌మైన ఆమెకు ఇంత‌వ‌ర‌కూ సంసార సుఖం తెలీద‌ట‌.

భార్యా, భ‌ర్త ఇద్ద‌రూ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లే. వివాహ‌మైన తొలిరోజు రాత్రి త‌న భ‌ర్త చీర‌క‌ట్టుకుని వ‌చ్చాడ‌ని ఆమె తెలిపింది. స‌హ‌జ శృంగారం కంటే స్వ‌లింగ సంప‌ర్కంపైనే అత‌నికి ఆస‌క్తని చెప్పింది. ఆఫీసు నుంచి రాగానే చీర క‌ట్టుకుంటాడ‌నీ, త‌న మేక‌ప్ కిట్‌తో అలంక‌రించుకుంటాడ‌నీ వివ‌రించింది. అత‌నితో విసిగిపోయాన‌నీ విడాకులిప్పించాల‌నీ మొర‌పెట్టుకుంది. బెంగ‌ళూరులోని ఇందిరాన‌గ‌ర్‌లో నివాస‌ముంటున్న 29ఏళ్ళ యువ‌తి కౌన్సెల‌ర్ ద‌గ్గ‌ర పెట్టుకున్న మొరిది. త‌న భ‌ర్త న‌పుంస‌కుడ‌ని పేర్కొంది. త‌ల్లిదండ్రుల‌కు అత‌డి విష‌యం తెలిసీ వివాహం చేసుంటే అంత‌కుమించిన ఘోరం మ‌రొక‌టుండ‌దు. కుమారుడి ప్ర‌వ‌ర్త‌న శైలిని గ‌మ‌నించుంటే ఒక యువ‌తి జీవితం ఇలా ఇక్క‌ట్ల‌పాల‌య్యేది కాదు క‌దా..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *