బాబు గారూ! వేలాది మైక్రో ఏటీఎంలు ఎక్క‌డున్నాయో చెబుతారా?

బాబు గారూ! వేలాది మైక్రో ఏటీఎంలు ఎక్క‌డున్నాయో చెబుతారా?

పొరుగు రాష్ట్రంలో ప‌చ్చి అబ‌ద్ధాలు మాట్లాడారు ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు. రాష్ట్రంలో వేల సంఖ్య‌లో మైక్రో ఏటీఎంల‌ను అందుబాటులోకి తెచ్చార‌ట‌. దీనివ‌ల్ల ఖాతాదారులు ఎక్క‌డా ఇబ్బంది ప‌డ‌కుండా న‌గ‌దును తీసుకుంటున్నార‌ట. న‌గ‌దు ర‌హిత లావాదేవీల‌ను ప్ర‌వేశ‌పెట్టామ‌ని, 30 నుంచి 35 శాతం డిజిట‌ల్ లావాదేవీలే న‌డుస్తున్నాయ‌ని చెప్పుకొచ్చారు.

 

అంతెందుకు పెద్ద నోట్ల ర‌ద్దు ప్ర‌భావాన్ని వంద‌శాతం నియంత్రించామ‌ని అన్నారు. ఇండియా టుడే క‌న్‌క్లేవ్‌కు హాజ‌రు కావ‌డానికి చెన్నైకి వ‌చ్చిన చంద్ర‌బాబును అక్క‌డి మీడియా ప్ర‌తినిధులు ప‌ల‌క‌రించిన సంద‌ర్భంగా చెప్పుకొచ్చిన మాట‌లు ఇవి. ఇందులో- వాస్త‌వం ఎంత‌? అనేది మ‌న‌కు తెలిసిన విష‌య‌మే. వేల సంఖ్య‌లో మైక్రో ఏటీఎంల‌ను ఎక్క‌డ అందుబాటులోకి తెచ్చారో మ‌న‌కైతే తెలియ‌దు. జీతం డ‌బ్బుల కోసం ఏటీఎంల వ‌ద్ద ఇప్ప‌టికీ జ‌నం బారులు తీరుతూనే ఉన్నారు. వాస్త‌వ ప‌రిస్థితులకు భిన్నంగా గొప్ప‌లు చెప్పుకోవ‌డం చంద్ర‌బాబుకు కొత్త కాదు.. వినే మ‌న‌కూ కొత్త కాదు. త‌మిళ మీడియాకే కొత్త‌.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *