ఈ వీడియో చూస్తే..రైల్వేస్టేష‌న్ ప్లాట్‌ఫాంల‌పై దొరికే ఆహారాన్ని తిన‌రు!

రైళ్ల‌ల్లో స‌ర‌ఫ‌రా చేసే ఆహారం ఎంత ఛండాలంగా ఉంటుందో మొన్నే కాగ్ క‌డిగిపారేసింది. అది మ‌నుషులు తినే ఆహార‌మేనా? అని రైల్వేమంత్రిత్వ‌ శాఖ‌ను నిల‌దీసింది. స‌రే! రైళ్ల‌ల్లో ఇచ్చే ఆహారం మాటెలా ఉన్నా.. ప్లాట్‌ఫాంల‌పైనా అదే ప‌రిస్థితి నెల‌కొంది. ఈ ప్లాట్‌ఫాం ఏ మారుమూల ప్రాంతానికి చెందిన‌దో కాదు.

ఘ‌న‌త వ‌హించిన మ‌న విశాఖ‌ప‌ట్నం రైల్వే స్టేష‌న్ అది. ఈ వీడియోలో.. తెలుగులో కూడా అనౌన్స్‌మెంట్ వినిపిస్తుంంది. ముగ్గురు యువ‌కులు ప్లాట్‌ఫాంపై ఉన్న ఆహార ప‌దార్థాల పాకెట్ల మీద కూర్చుని మ‌రీ వాటిని ప్యాక్ చేస్తున్నారు.

ప్లాట్‌ఫాంల మీద ఉండే దుమ్మ‌, ధూళిలోనే వాళ్లా ప‌ని చేస్తున్నారు. ఆహారాన్ని పొట్లాల్లో నింపి, వాటిని ట్రేల‌ల్లో అమ‌ర్చుతున్నారు. ఆ ట్రేల‌ల్లో ఉన్న‌వి ఆహార పొట్లాలు. వాళ్లు కూర్చున్న పాకెట్ల‌నే మ‌నం కొనుగోలు చేసి.. తింటున్నాం. క‌డుపు నింపుకొంటున్నాం. ఇందుకే రైల్వేస్టేష‌న్ ప్లాట్‌ఫారాల‌పై దొరికే ఆహార ప‌దార్థాల్లో నాణ్య‌త ఉండ‌దనేది.

About the author

Related

JOIN THE DISCUSSION