భారతజట్టు డ్రెస్ మీద ఎందుకు మూడు స్టార్స్ ఉంటాయో తెలుసా..?

భారత్ లో క్రికెట్ ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక వన్డే, టీ20 మ్యాచ్ లు వస్తున్నాయంటే కన్నార్పకుండా చూస్తారు మన జనం..! అయితే భారతజట్టు గురించి బాగా ఫాలో అయ్యే క్రికెట్ అభిమానులకు ఓ చిన్న ప్రశ్న.. భారత్ జెర్సీ మీద ఉన్న బీసీసీఐ లోగో పైన మూడు స్టార్లు ఉంటాయి.. అవి ఏవో తెలుసా..?

ఈ మూడు స్టార్లు మన ప్రపంచకప్ విజయాలను సూచిస్తాయట.. రెండు వన్డే వరల్డ్ కప్ విజయాలు, ఒక టీ20 వరల్డ్ కప్ విజయం మన భారత జట్టు నీలి రంగు బట్టల మీద ఉంటాయి. 1983, 2011లలో భారత్ వన్డే వరల్డ్ కప్ గెలిచింది. ఇక 2007 లో టీ20 వరల్డ్ కప్ గెలిచింది. అందుకనే భారత్ జట్టు జర్సీ మీద మూడు స్టార్లు ఉంటాయి. ఇటీవల విరాట్ కోహ్లీ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ నక్షత్రాల గురించి మాట్లాడాడు. ఇలాంటి దారిలోనే ఇటలీ, బ్రెజిల్ ఫుట్ బాల్ జట్లు కూడా వెళుతున్నాయి. బ్రెజిల్ ఫుట్ బాల్ జట్టు 1958, 1962, 1970, 1994, 2002లలో వరల్డ్ కప్ గెలిచింది. ఇటలీ జట్టు జర్సీ పై నాలుగు స్టార్స్ ఉంటాయి. ఇటలీ 1934, 1938, 1982, 2006 సంవత్సరాల్లో ప్రపంచకప్ సాధించింది.

About the author

Related

JOIN THE DISCUSSION