ప్రేమికుల పెళ్ళికి ఇరు కుటుంబాలు ఒప్పుకున్నాయి.. కులపెద్దలు ఒప్పుకోకపోవడంతో ఘోరమైన చావు..!

వారికి 18 ఏళ్ళు కూడా నిండలేదు.. కుటుంబ సభ్యులు వారి ప్రేమను ఒప్పుకోరని తెలిసి పారిపోవాలని అనుకున్నారు. అయితే కుటుంబసభ్యులు మాత్రం వారిని ఈ లోకంలోనే లేకుండా చేయాలని నిర్ణయించారు. మంచానికి కట్టేసి.. కరెంట్ షాక్ ఇచ్చి.. చిత్రహింసలు పెట్టి చంపేశారు. ఈ ఘోరమైన పరువు హత్య పాకిస్థాన్ లోని కరాచీ దగ్గర ఉన్న ఓ గ్రామంలో చోటుచేసుకుంది.

 

జిర్గా కులానికి కళంకం తెచ్చారన్న నెపంతో 15 ఏళ్ల అమ్మాయిని.. 17 ఏళ్ల అబ్బాయిని చంపేశారు. పెద్దలు త‌మ ప్రేమ‌ను అంగీక‌రించ‌ర‌ని తెలుసుకుని గ‌త నెల ఇంటి నుంచి పారిపోయారు. కొద్ది రోజుల తర్వాత కుటుంబ స‌భ్యులు వారి ఆచూకీని కనుగొన్నారు. ఈ విషయంపై పంచాయతి పెట్టిన ఆ కుల పెద్దలు చంపేయాలని తీర్మానం ఇచ్చారు. ఆ అమ్మాయిని మొదటి రోజే చిత్ర హింసలకు గురి చేసి కరెంట్ షాక్ ఇస్తూ చంపేశారు.. ఆ తర్వాత అంత్యక్రియలు నిర్వహించారు. మరో ఒక్క రోజు పాటు చావుతో పోరాడిన యువకుడు కూడా చనిపోయాడు. ప్రతిరోజూ 500పైగా ఇలాంటి హత్యలు పాకిస్థాన్ లో చోటుచేసుకుంటూ ఉంటాయట..! జిర్గా కులంలో పెద్దల మాటనే శాసనంగా భావిస్తారట.. చాలా మంది పేద ప్రజలు వారి కులపెద్దలు చెప్పినట్లుగా మలుచుకుంటారు. మొదట ఇద్దరికీ పెళ్ళి చేయాలని నిర్ణయించుకున్నారు.. కానీ కులపెద్దలు తలదూర్చి తమ కులానికి కళంకం తెస్తున్నారన్న నెపంతో చంపివేశారు. అక్కడ ఏ మాత్రం కూడా న్యాయవ్యవస్థ.. పోలీసులు అన్న విషయాలను పట్టించుకోరని వాలంటీర్లు చెప్పారు.

 

About the author

Related

JOIN THE DISCUSSION