ప్రాణం కాపాడిన చిన్నారి స‌మ‌య‌స్ఫూర్తి

ప్రాణం కాపాడిన చిన్నారి స‌మ‌య‌స్ఫూర్తి

ఊహ కూడా తెలియ‌ని వ‌య‌సులో ఒక చిన్నారిని మ‌రో చిన్నారిక‌వ‌ల స‌మ‌య‌స్ఫూర్తి క‌న‌బ‌రిచి ర‌క్షించాడు. అదెలాగంటారా చూడండి.. క‌వ‌ల సోద‌రులు చ‌క్క‌గా ఆడుకుంటున్నారు. ఇంట్లో ఉన్న డ్రెస్సింగ్ టేబుల్ సొరుగుల‌ను తెరిచారు. ఇద్ద‌రూ చెరో సొరుగులోకి ఎక్కి కూర్చోబోయారు. ఒక సోద‌రుడు ఎక్కి కూర్చున్నాడు. రెండో చిన్నారి కూర్చునే లోగా డ్రెస్సింగ్ టేబుల్ ఒక్క‌సారిగా కింద‌ప‌డిపోయింది. ఒక చిన్నారి దానికింద ఇరుక్కుపోయాడు.

ఊహ‌తెలియ‌ని రెండో చిన్నారికి ఏం జ‌రిగిందో తెలియ‌డానికి కొంచెం స‌మ‌యం ప‌ట్టింది. తోడ‌బుట్టిన వాణ్ణి ఎలా బ‌య‌ట‌కు తేవాలా అని ఆలోచిస్తున్న‌ట్లు టేబుల్ పైకి ఎక్కి రెండోవైపు దిగి మ‌రీ ప‌రీక్షించాడు. తిరిగి ముందువైపున‌కు వ‌చ్చి, టేబుల్‌ను త‌న బ‌లంతో నెట్టాడు. అంతే సోద‌రుడు బ‌య‌ట‌కొచ్చేశాడు. ఇంట్లో ఉన్న తల్లికి ఈ సంగ‌తే తెలీదు. టేబుల్ ప‌డిన విష‌య‌మే త‌న‌కు తెలియ‌దంటోందామె. త‌న చిన్నారి ఆరోగ్యంగానే ఉన్నాడ‌ని తండ్రి చెప్పాడు. ఈ ఉదంత‌మంతా సిసిటివిలో రికార్డ‌య్యింది. త‌ల్లిదండ్రుల అప్ర‌మ‌త్త‌త‌కోసం వారి తండ్రి ఈ వీడియోను ఫేస్‌బుక్‌లో పోస్టు చేశాడు. సాహ‌సం ప్ర‌ద‌ర్శించిన చిన్నారుల‌కు సాహ‌స బాల‌ల అవార్డు ఇచ్చే సంప్ర‌దాయం మ‌న దేశంలో ఉన్న‌ట్లే వారి దేశంలో కూడా ఏమైనా ఉన్నాయో లేదో తెలీదు. ఉంటే ఈ చిన్నారికి మాత్రం అంత‌కంటే పెద్ద అవార్డే ఇవ్వాలి. అమెరికా రాష్ట్రాల్లో ఒక‌టైన ఉటాలోని ఓరెమ్‌లో ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *