మనవాళ్ళు గూగుల్ తల్లిని ఏమేమి అడుగుతారో తెలుసా..?

గూగుల్ తల్లి.. ఏ ప్రశ్నకు సమాధానం కావాలన్నా ఇక్కడ లభిస్తుంది. అందుకే చిన్న చిన్న వాటికి కూడా గూగుల్ తల్లి వెంటపడుతుంటాం. గూగుల్ లాంటి సర్చ్ ఇంజన్ లు చాలా ఉన్నప్పటికీ గూగుల్ మీద ఉన్న గుడ్డి నమ్మకం మామూలుగా ఉండదులేండి. తల నొప్పిని ఎలా పోగొట్టుకోవాలి అనే దాని దగ్గర నుండి ప్రపంచం నాశనం అవుతుంటే ఏమి చేయాలి..? అనే వరకూ గూగుల్ ను అడుగుతూనే ఉంటారు. అందుకే గూగుల్ ఓపెన్ చేసి How To అని టైప్ చేస్తే చాలు ఏవేవో ప్రశ్నలు వస్తూనే ఉంటాయి. ఒక్కో దేశంలో ఒక్కో ప్రశ్నను ఎక్కువగా గూగుల్ ను అడుగుతుంటారట.. మన దేశంలో గూగుల్ ను ఎక్కువగా అడిగిన ప్రశ్న ఏంటో తెలుసా..? How To Hack Facebook.. మనవాళ్ళు కాస్త ఘటికులేనండోయ్.. ఇక ఇటలీ వాళ్ళైతే పాపం How To Fix A Toilet గూగుల్ లో అడుగుతుంతారట..! ఇలా ఒక్కో దేశం వాళ్ళు ఒక్కో ప్రశ్నను గూగుల్ మీద సందిస్తుంటారు.

ఇక ప్రపంచవ్యాప్తంగా గూగుల్ ను ఎక్కువగా అడిగే ప్రశ్నలు ఏంటో తెలుసా..?

1. How To KISS

పాపం ఎంత మంది ప్రేమికులు గూగుల్ ను ఈ ప్రశ్న అడిగుంటారో.. అప్పుడు గూగుల్ Watch Emraan Hashmi Movies అని ఆన్సర్ ఇచ్చి ఉంటుందేమో..!(నవ్వుకోడానికి మాత్రమే)

2. How To Get Pregnant
ఇది కొంచెం కాంప్లికేటెడ్ మ్యాటరే..! అయినా ఎవరి అనుమానాలు వాళ్ళవి.. ఎవరి భయాలు వాళ్ళవి..!

3. How To Tie a Tie

ఉద్యోగులకు సగం సమయం అయిపోతోందంటే అందుకు కారణం ఈ ‘టై’ మ్యాటరే.. వీటికి సంబంధించిన సమాధానాలు.. ఫోటోలు.. వీడియోలు.. అన్నీ గూగుల్ దగ్గరే ఉన్నాయి.

4. How To Lose Belly Fat

పొట్ట రావడం అనేది.. ఆడవాళ్లకైనా మగవాళ్ళకైనా చాలా ఇబ్బందే.. ఒక్కసారి పొట్ట వచ్చిందంటే..తగ్గించుకోవడం చాలా కష్టం. అందుకే ప్రతి ఒక్కరూ గూగుల్ మీద పడేది..!

5. How To Make Money
ధన మూలం ఇదం జగత్ అన్నారు. ఎవరికైనా డబ్బులు సంపాదించాలనే ఉంటుంది. అందుకే ప్రపంచ వ్యాప్తంగా తెగ వెతికే ప్రశ్నల్లో ఇదొక్కటి..!

6. How To Lose Weight
లావు తగ్గాలని.. నాజూకుగా కనిపించాలని ఎవరికి ఉండదు చెప్పండి. వెతికేకేమో వెతుకుతాము కానీ.. ఆచరించడం లోనే చాలా తేడా ఉంటుంది.

7. How To Make French Toast
ఫ్రెంచ్ టోస్ట్.. ఈ వంటకం కోసం ప్రపంచవ్యాప్తంగా తెగ వెతికారట.. అలాగని దీన్ని తయారు చేయడానికి గంటల సమయం పట్టదట..!

 

About the author

Related

JOIN THE DISCUSSION