బొమ్మ రైలూ బోల్తా కొట్టింది..

బొమ్మ రైలూ బోల్తా కొట్టింది..

మామూలు రైళ్లే కాదు.. బొమ్మ రైలు కూడా ప‌ట్టాలు త‌ప్పింది.. బోల్తా కొట్టింది. ఈ ఘ‌ట‌న‌లో అయిదుగురు ప్ర‌యాణికుల‌కు గాయాల‌య్యాయి. బొమ్మ రైలేంటి? బోల్తా కొట్ట‌డ‌మేంట‌ని అనుకుంటున్నారా? డార్జిలింగ్‌-సిలిగురి కొండ‌ప్రాంతం. హిల్ స్టేష‌న్లు కూడా. ఇక్క‌డికొచ్చే ప‌ర్యాట‌కుల కోసం ఓ బుల్లి రైలు న‌డుస్తుంటుంది.

డార్జిలింగ్ హిమాయ‌ల‌న్ రైల్వేస్ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో ఉన్న ఈ రైలుకు రెండే బోగీలు ఉంటాయి. రోడ్డు ప‌క్క నుంచి కూడా వెళ్తుంటుందీ రైలు. అందుకే దీనికి బొమ్మ రైల‌ని పేరు. ఇది కాస్తా ప‌ట్టాలు త‌ప్పింది. కుర్సియోనాగ్‌-మ‌హాన‌ది స్టేష‌న్ల మ‌ధ్య ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. అయిదుగురు ప్ర‌యాణికులు గాయ‌ప‌డ్డారు. వారిని స‌మీప ఆసుప‌త్రికి త‌ర‌లించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *